నాగిరెడ్డిపేటలో నివాసపు గుడిసె దగ్ధం
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): మండలంలోని నాగిరెడ్డిపేట గ్రామంలో శుక్రవారం రాత్రి ప్రమాదవశాత్తు నివాసపు గుడిసె దగ్ధమైంది. గ్రామంలోని పుల్ల మణెమ్మ తన సోదరి పద్మతో కలిసి నివాసపు గుడిసెలో నిద్రించగా ఆకస్మాత్తుగా పెద్దశబ్దం రావడంతో భయంతో బయటకు పరుగులు తీశారు. గుడిసెకు మంటలు అంటుకోవడంతో స్థానికుల సహాయంతో అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇచ్చారు. ఈ మేరకు ఫైరింజన్ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకొని మంటలను ఆర్పేశారు. అగ్ని ప్రమాదంతో బీరువాలో దాచిన రూ.6లక్షల నగదు, తులం బంగారం, 16తులాల వెండిపట్టీలు తదితర సామగ్రి కాలిబూడిదయ్యాయి. నాగిరెడ్డిపేట డీటీ రాజేశ్వర్, జూనియర్ అసిస్టెంట్ సాయి లు శనివారం ఘటనా స్థలాన్ని పరిశీలించారు.
అడ్లూర్ సబ్‌స్టేషన్‌లో అగ్ని ప్రమాదం
కామారెడ్డి రూరల్: కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని అడ్లూర్ సబ్‌స్టేషన్‌లో శనివారం సాయంత్రం అగ్నిప్రమాదం సంభవించింది. విద్యుత్ ఉపకేంద్రంలోని కెపాసిటర్ బ్యాంక్ విభాగంలో మంటలు చెలరేగడంతో అప్రమత్తమైన సిబ్బంది సరఫరా నిలిపివేశారు. అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేశారు. కెపాసిటర్ బ్యాంక్‌లోని సెల్స్ పేలడంతోనే ప్రమాదం జరిగినట్లు విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. ప్రమాద తీవ్రత తక్కువగా ఉండటంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.
నాగిరెడ్డిపేటలో నివాసపు గుడిసె దగ్ధం
Comments
Please login to add a commentAdd a comment