హైడ్రోక్లోరైడ్ ట్యాంకర్ బోల్తా
డిచ్‌పల్లి(నిజామాబాద్‌రూరల్): నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండల కేంద్రంలోని నాగ్‌పూర్ గేట్ సమీపంలో 44వ నెంబరు జాతీయ రహదారిపై శనివారం మధ్యాహ్నం హైడ్రోక్లోరైడ్ కెమికల్‌ను రవాణా చేస్తున్న ట్యాంకర్ బోల్తాపడింది. ట్యాంకర్ నుంచి హైడ్రోక్లోరైడ్ కెమికల్ లీకేజీ కావడంతో ఘాటైన వాసన పీల్చుకొని స్థానికులు, వాహనదారులు ఇబ్బందులుపడ్డారు. సమాచారం తెలుసుకున్న డిచ్‌పల్లి ఇన్‌చార్జి సీఐ భిక్షపతి, ఎస్సై ఎండీ షరీఫ్ సి బ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. డి చ్‌పల్లి నుంచి నిజామాబాద్ వైపు వెళ్లే వాహనాలను సీఎంసీ మీదుగా దారి మళ్లించారు. తహసీల్దార్ ప్రభాకర్, ఆర్‌ఐ సంతోష్ చేరుకొని వివరాలు తెలుసుకున్నారు. జిల్లా కేంద్రం నుంచి అగ్నిమాపక శకటాన్ని తెప్పించి ట్యాంకర్ నుంచి లీకై న కెమికల్ ద్వారా ఎలాంటి ప్రమాదం జరగకుండా జాగ్రత్త చర్యలు చేపట్టారు. మరో ట్యాంకర్‌ను రప్పించి బోల్తాపడిన ట్యాంకర్ నుంచి హైడ్రోక్లోరైడ్ కెమికల్‌ను నింపారు. ప్రమాదంలో గాయపడిన ట్యాంకర్ డ్రైవర్ ముఖేష్‌ను చికిత్స నిమిత్తం జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి ట్యాంకర్ డ్రైవర్ నిర్లక్ష్యం, అజాగ్రత్తే కారణమని అతడిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
● యాసిడ్ లీక్‌తో ఇబ్బందులు
● వాహనాల దారి మళ్లింపు
Comments
Please login to add a commentAdd a comment