కామారెడ్డి క్రైం: జిల్లా కేంద్రంలోని గ్రీన్ సిటీ కాలనీకి చెందిన వనం సంగీత అనే వివాహిత అదృశ్యమైనట్లు పట్టణ ఎస్‌హెచ్‌వో చంద్రశేఖర్ రెడ్డి గురువారం తెలిపారు. ఈ నెల 25న బంధువుల ఇంటికని వెళ్లి, తిరిగి రాలేదు. దీంతో ఆమె భర్త పాపయ్య చాలా చోట్ల గాలించినా ఆచూకీ దొరకలేదు. ఈమేరకు పాపయ్య పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌హెచ్‌వో తెలిపారు.
పేకాట ఆడుతున్న ముగ్గురి అరెస్ట్
కమ్మర్‌పల్లి: మండల కేంద్రంలోని మినీ స్టేడియం సమీపంలో పేకాట ఆడుతున్న ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు ఎస్సై అనిల్‌రెడ్డి గురువారం తెలిపారు. విశ్వసనీయ సమాచారం మేరకు పేకాట స్థావరంపై దాడి చేసి పేకాట ఆడుతున్న వారిని అదుపులోకి తీసుకున్నట్లు ఆయన తెలిపారు. అలాగే వారి వద్ద నుంచి రూ. 2580 నగదును స్వా ధీనం చేసుకున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment