రుణమాఫీ కాదేమీ..!?
ఇంకా ఎదురు చూపులే..
ఒక కుటుంబాన్ని యూనిట్ గా తీసుకుంటే.. కుటుంబంలోని ఇద్ద రు లేదా ముగ్గిరి పేరు మీద ఉన్న పంట రుణాల మొత్తం కలి పి రూ.2 లక్షలు దాటిన వారికి ఇప్పటి వరకు రుణమాఫీ వర్తించలేదు. అటువంటి కుటుంబాలు జిల్లా వ్యాప్తంగా వేల సంఖ్య లో ఉన్నాయి. ఇవే కాకుండా పథకాన్ని ప్రారంభిన నాటి నుంచి ఇప్పటిరకు జిల్లా వ్యాప్తంగా తమ కు రుణ మాఫీ రాలేదంటూ వ్యవసాయ శాఖ అధికారుల కు దాదాపు 10 వేల ఫిర్యాదులు అందాయి. వాటిలో సగానికి పైగా రైతుల సమస్యలు పరిష్కారం కావడంతో నాలు గో విడతలో రుణం మాఫీ అయ్యింది. మిగతా వారి సమస్య లు అలాగే ఉండిపోయాయి. రుణమాఫీ వర్తించని వారి సమ స్యలను పరిష్కరించంతోపాటు రూ.2లక్షలకు పైగా రుణాలు కలిగిన కుటుంబాలకు ప్రభుత్వం వెంటనే రుణమాఫీ నిధులు విడుదల చేయాలని రైతులు కోరుతున్నారు.
● లక్షా 201 మంది రైతులకు
రూ.717 కోట్లు..
● నాలుగు విడతల్లో నిధులు జమ
● సాంకేతిక సమస్యలతో
చాలా మందికి వర్తించని మాఫీ
● రూ.2లక్షలకు పైగా
రుణాలున్న వారి సంగతేమిటో..?
కామారెడ్డి క్రైం: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకాల్లో రుణమాఫీ ప్రధానమైనది. జిల్లాలో మొత్తం 1.98 లక్షల మంది రైతులు వివిధ బ్యాంకుల్లో రుణాలు పొందగా, నాలుగు విడతల్లో మొత్తం 1,00,201 మంది రైతులకు రూ.717 కోట్ల రుణ మాఫీ వర్తించింది. అయితే సాంకేతిక సమస్యల కారణంగా ఇప్పటి వరకు రు ణాలు మాఫీ కానివారితోపాటు కుటుంబం యూ నిట్‌గా రూ.2 లక్షలకు పైగా రుణాలున్న రైతు లు రుణమాఫీ ఎప్పుడొస్తుందని ఎదురు చూస్తున్నారు.
నాలుగు విడతల్లో ..
జిల్లాలోని వివిధ బ్యాంకుల్లో 1,98,374 మంది రైతులు రుణాలు పొందారు. రూ.2 లక్షలలోపు రుణాలు మాఫీ చేయాలంటే రూ.1,283.14 కోట్లు అవసరం ఉండేవి. కానీ అర్హుల జాబితా నుంచి ప్రభుత్వ ఉద్యోగులు, ఐటీ చెల్లింపుదారులను మినహాయించడంతో మొత్తంలో కొంత తగ్గింది. మొద టి విడతలో రూ.లక్ష లోపు రుణాలున్న 49,540 మంది రైతులకు రూ.231 కోట్లు, రెండో విడతలో 24,816 మందికి రూ.212 కోట్లు, మూడో విడతలో 16,903 మంది రైతులకు రూ.203 కోట్ల రుణమాఫీ వర్తించింది. రేషన్ కార్డులు లేక, ఆధార్, బ్యాంకు ఖాతా వివరాలు, పట్టాదార్ పాస్ పుస్తకాల్లో తప్పి దాలు వంటి సాంకేతిక సమస్యల కారణంగా చాలా మంది రైతులకు రుణమాఫీ కాలేదు. చాలా మందికి రేషన్ కార్డులు లేకపోవడాన్ని మొదటి విడతలోనే ప్రభుత్వం గుర్తించి కుటుంబ నిర్ధారణ సర్వే చేపట్టింది. సర్వే పూర్తయ్యాక నాలుగో విడతలో రూ.2 లక్షల లోపు రుణాలు ఉన్న మరో 8,942 మంది రైతులకు రూ.71.01 కోట్లు జమ చేశారు.
రుణమాఫీ రాలేదు
నాతోపాటు నా భార్య పేరు మీద రెండు ఖాతాలకు కలిపి రూ.1.60 లక్షల పంట రుణం ఉంది. ఆధార్ నంబ ర్ తప్పుందని రుణ మాఫీ వర్తించలేదు. సహకార అధికారులు సరి చేస్తామన్నారు. ఎదురుచూస్తున్నాం.
– భూంరెడ్డి, రైతు, గాంధారి
ఉన్నతాధికారులకు నివేదించాం
రూ.2 లక్షలకుపైగా రు ణాలున్న కుటుంబాల వివరాలను ఇదివరకే ప్రభుత్వానికి పంపించాం. సాంకేతిక సమస్యల కారణంగా రుణమాఫీ వర్తించని వారి వివరాలు ఉన్నతాధికారులకు నివేదించి పరిష్కారం అయ్యేలా చూస్తున్నాం. – తిరుమల ప్రసాద్, డీఏవో
రుణమాఫీ కాదేమీ..!?
రుణమాఫీ కాదేమీ..!?
Comments
Please login to add a commentAdd a comment