పోలింగ్ ప్రశాంతం
కామారెడ్డిలోని బాయ్స్ హైస్కూల్‌లో బారులు తీరిన ఓటర్లు
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి: ఉమ్మడి నిజామాబాద్ – కరీంనగర్ – ఆదిలాబాద్ – మెదక్ పట్టభధ్రులు, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ స్థానాలకు గురువారం నిర్వహించిన పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 25 ఉపాధ్యాయ, 29 పట్టభద్రుల పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 8 గంటలకు ఓటింగ్ ప్రక్రియ నమోదు కాగా, మధ్యాహ్నం వరకు మందకొడిగా సాగింది. మధ్యాహ్నం తరువాత ఓటర్లు కేంద్రాలకు పోటెత్తారు. జిల్లా కేంద్రంతోపాటు ఆయా మండలాల్లో పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి గొడవలకు ఆస్కారం లేకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, అదనపు కలెక్టర్లు శ్రీనివాస్‌రెడ్డి, విక్టర్, ఎస్పీ సింధుశర్మ, ఏఎస్పీ చైతన్యరెడ్డి, బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. కాగా కామారెడ్డి పట్టణంలో పట్టభద్రుల పోలింగ్ కేంద్రంలో కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్, అదనపు కలెక్టర్లు శ్రీనివాస్‌రెడ్డి, విక్టర్ ఓటేశారు. పిట్లంలోని పోలింగ్ కేంద్రంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు ఓటు హక్కును వినియోగించుకున్నారు. కామారెడ్డి, ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యేలు గంప గోవర్ధన్, జాజాల సురేందర్ ఓటేశారు. కాగా జిల్లా కేంద్రంతోపాటు ఆయా మండలాల్లో కాంగ్రెస్, బీజేపీ నేతలు పట్టభద్రుల ఓట్ల కోసం పోలింగు కేంద్రాలకు సమీపంలో టెంట్లు వేసుకుని కూర్చున్నారు. కామారెడ్డిలో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌అలీ ఓటర్లకు స్లిప్పులు అందజేశారు. ఉపాధ్యాయ సంఘాల నేతలు తాము ఏర్పాటు చేసుకున్న టెంట్లలో కూర్చుని ఓటర్లకు స్లిప్పులు అందజేయడంతోపాటు పోలింగ్ కేంద్రాల వివరాలను తెలిపారు.
పట్టభద్రులు అంతంతే...
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటేసేందుకు జిల్లాకు చెందిన పట్టభద్రులు పెద్దగా ఆసక్తి చూపలేదు. 16,410 ఓట్లకు గాను 12,820 ఓట్లు పోలయ్యాయి. అంటే 78.12 శాతం మంది ఓట్లేశారు. ఓటింగ్ శాతం పెరుగుతుందని భావించినప్పటికీ పట్టఽభద్రులు చాలా మంది ఓటు వేయడానికి రాలేదు. 3,590 మంది పట్టభద్రులు ఓటు వేయలేదు.
ఉపాధ్యాయుల్లో ఉత్సాహం
పోలింగ్‌లో ఉపాధ్యాయులు ఉత్సాహంగా పాల్గొన్నారు. మొత్తం 2011 ఓట్లకుగాను 1,883 ఓట్లు పోలయ్యాయి. 93.63 శాతం పోలింగ్ నమోదైంది. కామారెడ్డిలోని గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాని కి మధ్యాహ్నం నుంచి టీచర్లు భారీ సంఖ్యలో తరలివచ్చి వరుస కట్టారు. కేవలం 128 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోలేదు.
శాసన మండలి ఎన్నికల ఓటింగ్‌లో టీచర్లు ఉత్సాహంగా పాల్గొనగా, పట్టభద్రులు అంతగా ఆసక్తి చూపలేదు! జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 54 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్‌తోపాటు అదనపు కలెక్టర్లు, సబ్ కలెక్టర్, ఎస్పీ సింధుశర్మ, ఏఎస్పీ చైతన్యరెడ్డి పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. మొదటిసారి ఓటు హక్కు వచ్చిన పట్టభద్రులు ఉత్సాహంగా ఓటింగ్‌లో పాల్గొన్నారు.
ఉపాధ్యాయుల ఆసక్తి..
పట్టభద్రుల అనాసక్తి..!
ఓటేసిన టీచర్లు 93.63 శాతం..
పట్టభద్రులు 78.12 శాతం
ఓటు హక్కు వినియోగించుకున్న
అధికారులు.. ప్రజాప్రతినిధులు..
మాజీ ప్రజాప్రతినిధులు
పట్టభద్రుల ఓట్ల వివరాలు
డివిజన్ ఓట్లు పోలైనవి శాతం
కామారెడ్డి 9350 7160 76.6
ఎల్లారెడ్డి 2655 2211 83.28
బాన్సువాడ 4405 3449 78.30
మొత్తం 16,410 12,820 78.12
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓట్ల వివరాలు
డివిజన్ ఓట్లు పోలైనవి శాతం
కామారెడ్డి 1331 1242 93.3
ఎల్లారెడ్డి 163 151 92.64
బాన్సువాడ 517 490 94.78
మొత్తం 2011 1883 93.63
ఓటు హక్కు వినియోగించుకోని వారు
పట్టభద్రులు : 3,590
టీచర్లు : 128
Comments
Please login to add a commentAdd a comment