భిక్కనూరులో స్వల్ప ఉద్రిక్తత
భిక్కనూరు: మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాల పోలింగ్ కేంద్రం బయట స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఓటింగ్ సరళిని పరిశీలించేందుకు వచ్చిన బీజేపీ జిల్లా అధ్యక్షుడు నీలం చిన్న రాజులుతో నాయకులు, కార్యకర్త లు రోడ్డుపై మాట్లాడుతుండగా దూరంగా వెళ్లా లని పోలీసులు సూచించారు. తాము నిబంధనల ప్రకారమే పొలింగ్ కేంద్రానికి దూరంలో ఉన్నామని, కాంగ్రెస్ నాయకులు నిబంధనల ను ఉల్లంఘించి ప్రచారం చేస్తున్నా పట్టించుకోవడం లేదంటూ బీజేపీ నాయకులు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే సీఐ సంపత్‌కుమార్ అక్కడికి వచ్చి వారిని శాంతింపజేశారు. భిక్కనూరుకు వచ్చిన ఏఎస్పీ చైతన్యరెడ్డి రోడ్డు పక్కన వేసిన టెంట్లను తొలగించాలని సూచించడంతో పోలీసులు తొలగించారు.
లింగంపేటలో బీజేపీ నాయకుల నిరసన
లింగంపేట(ఎల్లారెడ్డి): మండల కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాల పోలింగ్ కేంద్రాన్ని ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాసులు పరిశీలించారు. ఆయన తిరిగి వెళ్తున్న సమయంలో సహకార సంఘం వద్ద జనాలు గుమిగూడి ఉండడాన్ని గమనించి సిబ్బందితో కలిసి వారిని పంపించారు. ఈ క్రమంలో అక్కడే నిలబడి ఉన్న బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి రాంచందర్‌పై డీఎస్పీ చేయిచేసుకున్నారు. తాను నిబంధనల ప్రకారం పోలింగ్ కేంద్రానికి దూరంగా లైన్‌దాటి ఉన్నా డీఎస్పీ దాడి చేశాడని రాంచందర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై డీఐజీ, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కు ఫోన్ ద్వారా ఫిర్యాదు చేసినట్లు నాయకులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment