తాగునీటి గోస తీర్చండి సారూ..
పెద్దకొడప్‌గల్(జుక్కల్): తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నా అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడంలేదని మండల కేంద్రంలో రెడ్డి కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో మిషన్ భగీరథ పైపులైన్‌కు అందరూ మోటార్లు పెట్టడంతో మా కాలనీకి భగీరథ నీరు రావడంలేదని వారు వాపోతున్నారు. గతంలో మిషన్ భగీరథ నీరు వచ్చే సమయంలో కరెంట్ తీయించి నీటిని వదిలేవారు. ఇప్పడు ఆ సమయంలో కరెంట్ తీయకపోవడంతో వచ్చేనీరు కూడా రావడంలేదంటున్నారు. నెల రోజుల నుంచి ఇబ్బందులు పడుతున్నామని, మా కాలనీలో ఉన్న సింగిల్ ఫేజ్ మోటార్ చెడిపోయిందని, వెంటనే మరమ్మతులు చేయించమని పలుమార్లు పంచాయతీ కార్యదర్శికి చెప్పినా పట్టించుకోవడం లేదని కాలనీవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment