విత్తన బంతుల తయారీ
భిక్కనూరు: మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నేషనల్ గ్రీన్‌కార్ప్స్ సహకారంతో విద్యార్థులు సోమవారం విత్తన బంతులను తయారు చేశారు. 20 రకాల విత్తనాలను సేకరించి దాదాపు వెయ్యి విత్తన బంతులను తయారు చేశామని వ్యాయామ ఉపాధ్యాయుడు నర్సింహారెడ్డి తెలిపారు. ఈ విత్తన బంతులను ఎండబెట్టి, నిల్వ చేసి జూన్ మూడో వారంలో అటవీ శాఖ చూపించిన ప్రదేశంలో వేస్తామని పేర్కొన్నారు. పర్యావరణ వ్యవస్థ, అడవులను పరిరక్షించడంపై విద్యార్థి దశలోనే అవగాహన కల్పించడం ద్వారా జీవ వైవిధ్యాన్ని పెంపొందించవచ్చని పాఠశాల హెచ్‌ఎం శ్రీనాథ్ పేర్కొన్నారు. కార్యక్రమంలో సైన్స్ ఉపాధ్యాయులు రాజు, సరిత, సుజాత, శ్రీమతి, ప్రసన్నలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment