జిల్లా ఎంపీడీవోల సంఘం కార్యవర్గం ఎన్నిక
కామారెడ్డి అర్బన్ : తెలంగాణ మండల పరిషత్ అభివృద్ధి అధికారుల సంఘం జిల్లా కా ర్యవర్గాన్ని మంగళవారం ఎన్నుకున్నారు. జె డ్పీ సీఈవో బి.చందర్ ఆధ్వర్యంలో ఎన్నిక ప్రక్రియ నిర్వహించారు. అధ్యక్షుడిగా టీవీ ఎస్ గోపిబాబు(మాచారెడ్డి), ప్రధాన కార్య దర్శిగా ఎం.సంతోష్‌కుమార్(సదాశివనగర్), కోశాధికారిగా ఎల్.రాజేశ్వర్(గాంధారి), ఉపాధ్యక్షులుగా రాణి (మద్నూర్), సంయుక్త కార్యదర్శిగా కమలాకర్ (పిట్లం), కా ర్యవర్గ సభ్యులుగా సయ్యద్ సాజిద్ అలీ(తాడ్వాయి), నాగవర్ధన్ (కామారెడ్డి), శ్రీనివాస్ (జుక్కల్) ఏకగీవ్రంగా ఎన్నికయ్యారు.
సబ్ జైల్ తనిఖీ
కామారెడ్డి టౌన్ : జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, జిల్లా న్యాయమూర్తి టి. నాగరాణి మంగళవారం జిల్లా కేంద్రంలోని సబ్ జైల్‌ను తనిఖీ చేశారు. ఖైదీల వివరాలు తెలుసుకున్నారు. ఖైదీల హక్కులు, చట్టాలు గురించి వివరించారు. ఫిర్యాదుల బాక్స్, వంట గది, పరిసర ప్రాంతాలను తనిఖీ చే శారు. కార్యక్రమంలో చీఫ్ లీగల్ ఎయిడ్ డి ఫెన్స్ కౌన్సిల్ న్యాయవాది మాయ సురేష్, అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ శ్రీనివాస్ రావు, సబ్ జైలు సూపరింటెండెంట్ సంజీవరెడ్డి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ సిబ్బంది శ్రావణ్, ఉదయ, సాయికృష్ణ తదితరులు పాల్గొన్నారు.
‘పర్యాటక కేంద్రంగా మారుస్తాం’
లింగంపేట: లింగంపేటను పర్యాటక కేంద్రంగా మారుస్తామని డీఆర్డీవో సురేందర్ పేర్కొన్నారు. మంగళవారం ఆయన మండల కేంద్రంలోని పలు దర్శనీయ స్థలాలను సందర్శించారు. జగన్నాథ ఆలయం వద్ద నీటి కొలను, ఆలయంలోని శివలింగం, సొరంగ మార్గాన్ని, నగరేశ్వర ఆలయం ముందున్న గాలికి ఊగే స్తంభాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ లింగంపేటలో చారిత్రక కట్టడాలు, ప్రసిద్ధి చెందిన క్షేత్రాలు ఉన్నాయన్నారు. వాటిని మరింత అభివృద్ధి చేస్తే పర్యాటక కేంద్రంగా మారుతుందన్నారు. ఇందుకోసం నిధుల మంజూరు కోసం పర్యాటక శాఖకు ప్రతిపాదనలు పంపుతామన్నారు. అనంతరం గ్రామ శివారులో ఉపాధి హామీ పనులను పరిశీలించారు. కూలీల హాజరు పట్టికను తనిఖీ చేశారు. నర్సరీ, కంపోస్టు షెడ్, శ్మశాన వాటిక, పల్లె ప్రకృతి వనాలను పరిశీలించారు. ఆయన వెంట ఎంపీడీవో నరేశ్, పంచాయితీ కార్యదర్శులు ఉన్నారు.
ఫిక్కీ అవార్డు
అందుకున్న సీఐ
భిక్కనూరు: భిక్కనూరు మండలానికి చెందిన గడ్డం మల్లేశ్‌ను ప్రతిష్టాత్మక ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ(ఫిక్కీ) ప్రత్యేక జ్యూరీ అవార్డు వ రించింది. మంగళవారం ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఆయన ఈ అవార్డును అందుకున్నారు. మల్లేశ్ ప్రస్తుతం జీడిమెట్ల పోలీస్ స్టేషన్‌లో సీఐగా పనిచేస్తున్నారు. సైబర్ నేరాలపై అవగాహన కల్పించడం, అదుపు చేయడానికి చేస్తున్న కృషిని గుర్తించి అవార్డు అందించారని ఆయన తెలిపారు.
జిల్లా ఎంపీడీవోల సంఘం కార్యవర్గం ఎన్నిక
జిల్లా ఎంపీడీవోల సంఘం కార్యవర్గం ఎన్నిక
జిల్లా ఎంపీడీవోల సంఘం కార్యవర్గం ఎన్నిక
Comments
Please login to add a commentAdd a comment