నేటి నుంచి ఇంటర్ పరీక్షలు
కామారెడ్డి టౌన్ : ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు బుధవారంనుంచి ప్రారంభంకానున్నాయి. ఇందుకోసం జిల్లా విద్యాశాఖ, ఇంటర్మీడియట్ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. జిల్లాలో ఫస్టియర్ పరీక్షలకు 8,743 మంది, సెకండియర్ పరీక్షలకు 9,729 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. వీరికోసం జిల్లావ్యాప్తంగా 38 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. రోజూ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష నిర్వహిస్తారు. విద్యార్థులు అరగంట ముందే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని జిల్లా ఇంటర్మీడియట్ నోడల్ అధికారి షేక్ సలాం సూచించారు. పరీక్ష ప్రారంభమైన ఐదు నిమిషాల వరకు పరీక్ష కేంద్రంలోనికి అనుమతి ఇస్తామని పేర్కొన్నారు.
మాస్ కాపీయింగ్‌ను అరికట్టేందుకు ఇంటర్ వార్షిక పరీక్షలను సీసీ కెమెరాల నిఘాలో నిర్వహించనున్నారు. కాగా ఈసారి ప్రతి ప్రశ్నపత్రానికి యునిక్ సీరియల్ నంబర్ ఇచ్చారు. దీంతో పేపర్ లీకై తే ఎవరినుంచి లీకయ్యిందో తేలికగా తెలుసుకునే అవకాశం ఉంటుంది.
ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు
విద్యార్థులు అరగంట ముందే
చేరుకోవాలని సూచన
Comments
Please login to add a commentAdd a comment