కామారెడ్డి క్రైం : ప్రజలకు మేమున్నామనే భరోసా కల్పించడానికే ఫ్లాగ్ మార్చ్ నిర్వహించామని కామారెడ్డి ఏఎస్పీ చైతన్యరెడ్డి తెలిపారు. జిల్లా కేంద్రంలో మంగళవారం ప్రత్యేక బలగాలు కవాతు నిర్వహించాయి. పట్టణంలోని రైల్వే స్టేషన్ రోడ్‌నుంచి ప్రారంభమైన కవాతు డైలీ మార్కెట్, సుభాష్ రోడ్, పాన్ చౌరస్తా, బడా మసీద్, నిజాంసాగర్ చౌరస్తా, కొత్త బస్టాండ్, రైల్వే గేట్, బతుకమ్మ కుంట, పాత బస్టాండ్ వరకు సాగింది. ఈ సందర్భంగా ఏఎస్పీ చైతన్యరెడ్డి మాట్లాడుతూ జిల్లా భౌగోళిక పరిస్థితులను ఆకళింపు చేసుకోవడానికి సికింద్రాబాద్‌లో ఉండే 99వ బెటాలియన్‌కు చెందిన ప్రత్యేక బలగాల బృందం జిల్లాకు వచ్చిందన్నారు. ఎప్పుడైనా జిల్లాలో శాంతిభద్రతల సమస్య, మత ఘర్షణలు లాంటివి జరిగితే బెటాలియన్ బలగాలు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితులను అదుపు చేయడంలో స్థానిక పోలీసులకు సహకరిస్తారన్నారు. కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ యాకుబ్‌రెడ్డి, టౌన్ ఎస్‌హెచ్‌వో చంద్రశేఖర్‌రెడ్డి, ఆర్‌ఐలు సంతోష్ కుమార్, కృష్ణ, రాపిడ్ యాక్షన్ ఫోర్స్ డిప్యూటీ కమాండెంట్ టీపీ బగేల్, సీఐలు హరిబాబు, మల్లేశ్వరరావు, 145 మంది సిబ్బంది పాల్గొన్నారు.
కామారెడ్డి ఏఎస్పీ చైతన్యరెడ్డి
జిల్లా కేంద్రంలో ప్రత్యేక బలగాల
ఫ్లాగ్ మార్చ్
Comments
Please login to add a commentAdd a comment