స్థానికుల వద్ద టోల్ వసూలు చేయొద్దు
భిక్కనూరు : ‘‘మా పొలాలు జాతీయ రహదారి ప క్కన ఉన్నాయి. పొలాల వద్దకు రోజూ రెండు మూ డుసార్లు వెళ్లి వస్తాం. ఇంతకు ముందెప్పుడూ మా వాహనాలకు టోల్ ట్యాక్స్ వసూలు చేయలేదు. ఇ ప్పుడు కొత్తగా ఎందుకు వసూలు చేస్తున్నారు’’ అంటూ రామేశ్వర్‌పల్లి గ్రామస్తులు భిక్కనూరు టోల్‌ప్లాజా నిర్వాహకులను నిలదీశారు. మంగళవారం టోల్‌ప్లాజా వద్దకు వచ్చి నిరసన తెలిపారు. టోల్ గే ట్ బూత్‌లను మూయించి, గేట్లను తెరిపించి సు మారు 45 నిమిషాలు ఆందోళన చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ భిక్కనూరులో టోల్ ప్లాజా ఏర్పాటైనప్పటినుంచి తమ వద్ద నుంచి ఎప్పుడూ టోల్ ట్యాక్స్ వసూలు చేయలేదన్నారు. ఇప్పుడు కొత్త కాంట్రాక్టర్ తమ వాహనాలకు టోల్ వసూలు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. టోల్ ప్లాజా ఇన్‌చార్జి ప్రకాశ్ ఆందోళనకారుల వద్దకు వచ్చి మాట్లాడారు. సమస్యను యాజమాన్యం దృష్టికి తీసుకువెళ్తానన్నారు. యాజమాన్యంనుంచి స్పందన వచ్చేంతవరకు లోకల్ ఆధార్ కార్డు చూపించిన వారికి టోల్ ట్యాక్స్ వసూలు చేయబోమన్నారు. దీంతో రామేశ్వర్‌పల్లివాసులు శాంతించి, ఆందోళన విరమించారు.
రామేశ్వర్‌పల్లి రైతుల డిమాండ్
భిక్కనూరు టోల్‌ప్లాజా వద్ద నిరసన
Comments
Please login to add a commentAdd a comment