సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : ఉపాధ్యా య ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి మల్క కొమురయ్య ఘన విజయం సాధించా రు. తొలి ప్రాధాన్యత ఓ ట్లతోనే ఆయన విజ య తీరాలకు చేరారు. ఇది ఆ పార్టీ శ్రేణుల లో ఉత్సాహాన్ని నింపింది. రాష్ట్రంలో శాస న మండలిని పునరుద్ధరించిన నాటి నుంచి మె దక్ – కరీంనగర్ – ఆదిలాబాద్ – నిజామాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాన్ని పీఆర్‌టీయూనే గెలుస్తూ వచ్చింది. ఉపాధ్యాయ సంఘాలే అభ్యర్థులను నిలబెడుతూ వచ్చాయి. అయి తే ఈసారి అనూహ్యంగా బీజేపీ అభ్యర్థిని బరిలో దించింది. అంతేకాకుండా పార్టీ అభ్యర్థి గెలుపుకో సం రాష్ట్ర నాయకత్వం విస్తృతంగా ప్రచారం నిర్వ హించింది. ఉపాధ్యాయులను తమవైపు తిప్పుకునేందుకు ఆ పార్టీ నేతలు చేసిన ప్రయత్నాలు సక్సెస్ అయ్యాయి. తొలి ప్రాధాన్యత ఓట్లతోనే బీజేపీ అభ్యర్థి గెలుపొందడమే దీనికి నిదర్శనం.
పెరిగిన బలం..
జిల్లాలో నాలుగు అసెంబ్లీ నియోజక వర్గాలు ఉండగా 2023లో జరిగి న అసెంబ్లీ ఎన్నికల్లో కా మారెడ్డి నుంచి బీజేపీ అ భ్యర్థి కాటిపల్లి వెంకటరమ ణారెడ్డి విజయం సాధించారు. అదీ అప్పటి సీఎం కేసీఆర్, ప్రస్తుత ముఖ్య మంత్రి రేవంత్‌రెడ్డిలను ఆయన ఓడించి జేయింట్ కిల్లర్‌గా అవతరించారు. ఎల్లారెడ్డి, బాన్సువాడ, జుక్కల్ నియోజకవర్గాల్లో ఆ పార్టీ అభ్యర్థులు ఓడినప్పటికీ గణనీయమైన సంఖ్యలో ఓట్లు సాధించారు. ఆ తర్వాత జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో జహీరాబాద్ స్థానంలో బీజేపీ అభ్యర్థి ఓడినా.. కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాల్లో ఆ పార్టీకే మెజారిటీ వచ్చింది. బాన్సువాడ, జుక్కల్ నియోజకవర్గాలలో కాంగ్రెస్‌కు ఎక్కువ ఓట్లు వచ్చాయి.
నిజామాబాద్ జిల్లాలో నిజామాబాద్ అర్బన్, ఆర్మూర్ నియోజకవర్గాలలో బీజేపీ ఎమ్మెల్యేలున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కమల దళానికి నలుగురు ఎమ్మెల్యేల బలం ఉంది. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ పార్లమెంట్ స్థానాలూ బీజేపీ ఖాతాలోనే ఉన్నాయి. రాష్ట్రంలో అధికారంలోకి రావాలని భావిస్తున్న బీజేపీ.. ఎమ్మె ల్సీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎంపీలు, ఎమ్మెల్యేలతోపాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు తమ అభ్యర్థి విజయం కోసం ప్రణాళికబద్ధంగా కృషి చేశారు. దీంతో ఆ పార్టీ ఆశించిన ఫలితాన్ని సాధించిందన్న అభిప్రాయం రాజకీయ విశ్లేషకుల్లో వ్యక్తమవుతోంది.
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి మల్క కొమురయ్య ఘన విజయం సాధించడం, పట్టభద్రుల స్థానంలోనూ ఆధిక్యంలో ఉండడం ఆ పార్టీ శ్రేణులకు కొత్త ఉత్సాహాన్నిచ్చింది. కొముర య్య గెలుపొందడంతో జిల్లా వ్యాప్తంగా పార్టీ శ్రేణు లు సంబరాలు చేసుకున్నాయి. రాబోయే మున్సిప ల్, మండల, జిల్లా పరిషత్, పంచాయతీ ఎన్నికల్లోనూ విజయం సాధిస్తామన్న ధీమా ఆ పార్టీ నేతల్లో వ్యక్తమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment