కామారెడ్డి టౌన్: బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కేటీఆర్, జగదీశ్‌రెడ్డిల శాసనసభ సభ్యత్వాలను రద్దు చేయాలని డీసీసీ అధ్యక్షుడు కై లాస్ శ్రీనివాస్‌రావు డిమాండ్ చేశారు. స్పీకర్‌పై వారు చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ ఆదివారం కాంగ్రెస్ ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా ఆందోళనలు చేశారు. జిల్లాకేంద్రంలోని ఇందిరా చౌక్ వద్ద కేటీఆర్, జగదీశ్‌రెడ్డిల దిష్టిబొమ్మలను దహనం చేశారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్‌రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీనివాస్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు పండ్ల రాజు, నాయకులు శ్రీనివాస్, షేరు, అంజాద్, ప్రసాద్, రవి, గణే ష్, నర్సింలు, మహేష్, గంగాధర్ పాల్గొన్నారు.
డీసీసీ అధ్యక్షుడు
కై లాస్ శ్రీనివాస్‌రావు
జిల్లావ్యాప్తంగా కేటీఆర్,
జగదీశ్‌రెడ్డి దిష్టిబొమ్మల దహనం