మానసిక వికాసానికి క్రీడలు దోహదం | - | Sakshi
Sakshi News home page

మానసిక వికాసానికి క్రీడలు దోహదం

Published Thu, Mar 20 2025 2:35 AM | Last Updated on Thu, Mar 20 2025 2:33 AM

మానసిక వికాసానికి క్రీడలు దోహదం

మానసిక వికాసానికి క్రీడలు దోహదం

తెయూ(డిచ్‌పల్లి): విద్యార్థులు చదువుతోపాటు క్రీడా నైపుణ్యాలను అలవర్చుకోవాలని, మానసిక వికాసానికి క్రీడలు ఎంతో దోహదపడతాయని తెలంగాణ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్‌ టీ యాదగిరి రావు తెలిపారు. తెయూ క్యాంపస్‌ క్రీడామైదానంలో యాన్యువల్‌ డే స్పోర్ట్స్‌ మీట్‌ –2025ను బుధవారం సాయంత్రం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ జీవితంలో గెలుపు, ఓటములు సహజమని ఈ విషయాన్ని విద్యార్థులు క్రీడాపోటీల ద్వారా అలవర్చుకోవాలన్నారు. ఈ నెల 29వరకు పోటీలు జరుగుతాయన్నారు. వాలీబాల్‌, ఖోఖో, కబడ్డీ, క్రికెట్‌, బ్యాడ్మింటన్‌ పోటీలను బాలికలకు, బాలురకు వేర్వేరుగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అధ్యాపకులకూ వాలీబాల్‌, క్రికెట్‌ పోటీలను నిర్వహిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్‌ మామిడాల ప్రవీణ్‌, పీఆర్వో ఏ పున్నయ్య, స్పోర్ట్స్‌ డైరెక్టర్‌ జీ బాలకిషన్‌, పీడీ బీఆర్‌నేత, కోచ్‌లు, పీఈటీలు, విద్యార్థులు పాల్గొన్నారు.

వీసీ ప్రొఫెసర్‌ యాదగిరి రావు

తెలంగాణ యూనివర్సిటీలో

స్పోర్ట్స్‌ మీట్‌– 2025 ప్రారంభం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement