జుక్కల్ నియోజకవర్గానికి కోట్ల నిధులు
బిచ్కుంద/పిట్లం/నిజాంసాగర్ (జుక్కల్): అన్ని రంగాల్లో వెనకబడి ఉన్న జుక్కల్ నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రభుత్వం కోట్ల నిధులు మంజూరు చేసిందని ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు అన్నారు. గురువారం బిచ్కుందలో సీసీ రోడ్లు పనులను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ ఆర్ధిక సంవత్సరానికి సీసీ రోడ్లు, డ్రెయినేజీల నిర్మాణం కోసం రూ.18 కోట్లు తెచ్చానన్నారు. బిచ్కుంద మండలానికి రూ.4 కోట్లు నిధులతో పనులు చేపడుతున్నామన్నారు. గ్రామాలలో సీసీ రోడ్లు, డ్రెయినేజీలు పనులు కొనసాగుతున్నాయన్నారు. పిట్లం మండల పరిషత్ కార్యాలయంలో ఎస్సీ కార్పొరేషన్ సౌజన్యంతో ఎస్సీ నిరుద్యోగ మహిళలకు కుట్టు మిషన్లను ఎమ్మెల్యే లక్ష్మీ కాంతారావు పంపిణీ చేశారు. మండలంలోని హస్నాపూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి, పిట్లం మండలంలోని ఎంఎం కాలనీలో సీసీ రోడ్ల పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అన్ని రంగాల్లో మహిళలు రాణించాలని ప్రభుత్వం ఆడబిడ్డలకు అండగా ఉంటూ ప్రోత్సహిస్తుందన్నారు. జుక్కల్ క్యాంపు కార్యాలయంలో అన్ని మండలాల, అన్ని శాఖల అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. రాజీవ్ యువ వికాసం రుణాలు ప్రతి ఒక్కరికి అందేలా అధికారులు బాధ్యత వహించాలన్నారు. రాజీవ్ యువ వికాసం రుణాలపై జోరుగా ప్రచారం చేయాలన్నారు. తాగునీటి సమస్యలు తలెత్తకుండా ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం జుక్కల్ మండలంలోని దోస్త్ పల్లి, కేంరాజ్ కల్లాలి, వజ్రఖండి,ఖండేబల్లూర్, సవర్గావ్,దోస్తపల్లి,పెద్ద ఎడిగి, చండేగావ్ గ్రామాలకి చెందిన బీజేపీ, బీఆర్‌ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి ఎమ్మెల్యే లక్ష్మీ కాంతారావు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈకార్యక్రమంలో పిట్లం,బిచ్కుంద మండలాల కాంగ్రెస్ పార్టీ నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు
పలు చోట్ల అభివృద్ధి పనులు ప్రారంభం
జుక్కల్ నియోజకవర్గానికి కోట్ల నిధులు
Comments
Please login to add a commentAdd a comment