మద్నూర్(జుక్కల్): మండల కేంద్రంలోని వ్యాపారులు గురువారం గ్రామ పంచాయతీ కార్యాలయానికి తరలివచ్చి ప్రత్యేకాధికారి రాణికి తై బజార్ రేట్లు తగ్గించాలని వినతి పత్రం అందించారు. గ్రామ పంచాయతీ పరిధిలో కురగాయలు, పండ్ల దుకాణాలు ఇతర చిరు వ్యాపారులకు తై బజార్ తగ్గించాలని విన్నవించారు. ఈ కార్యక్రమంలో ఎంపీవో వెంకటనర్సయ్య, పంచాయతీ కార్యదర్శి సందీప్, వ్యాపార సంఘం ఉపాధ్యక్షుడు ఉడుతావార్ సురేష్, పండరి, కార్యదర్శి రచ్చ కుషాల్, కోశాధికారి సంతోష్ వ్యాస్, వ్యాపారులు బండి దత్తు తదితరులున్నారు.
క్యూరియాసిటీ
సైన్స్ కిట్‌పై కార్యశాల
కామారెడ్డి రూరల్ : కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని టేక్రియాల్ కేజీబీవీ పాఠశాలలో సీసీఎల్(సెంటర్ ఫర్ క్రియేటివ్ లర్నింగ్) ఐఐటీ గాంధీనగర్ గుజరాత్ నుంచి పంపిన క్యూరియాసిటీ సైన్స్ కిట్ వర్క్‌షాప్‌ను జిల్లా అకాడమిక్ మానిటరింగ్ అధికారి వేణుశర్మ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఇందులో సీడి విజిల్, యాంటి గ్రావిటీ టన్నెల్, భౌతిక రసాయన శాస్త్రంలోని వివిధ అంశాలపై రిసోర్స్ పర్సన్‌లు ప్రవీణ్‌కుమార్, టి శ్రీనివాస్, ఎన్ శ్రీనివాస్‌లు వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని 20 కేజీబీవీ పాఠశాలలోని భౌతిక రసాయన శాస్త్ర ఉపాధ్యాయులు, రిసోర్స్ పర్సన్‌లు తదితరులు పాల్గొన్నారు.
తై బజార్ రేట్లు తగ్గించాలని వినతి