కామారెడ్డి టౌన్: జిల్లాలో పదో తరగతి వార్షిక పరీక్ష లు శుక్రవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు కావడంతో పరీక్ష కేంద్రాల వద్ద విద్యార్థులు, తల్లిదండ్రులతో సందడి నెలకొంది. స మయానికి ముందే విద్యార్థులు కేంద్రాలకు చేరుకున్నారు. సిబ్బంది వారిని క్షుణ్ణంగా తనిఖీ చేసి లోపలికి అనుమతించారు. జిల్లావ్యాప్తంగా 64 కేంద్రా ల్లో 12,579 మంది విద్యార్థులు పరీక్ష రాయాల్సి ఉండగా 12,552 మంది పరీక్ష రాశారు. 27 మంది గైర్హాజరయ్యారు. డీఈవో రాజు పరీక్షలను పర్యవేక్షించారు. పట్టణంలోని గౌతమ్ మోడల్ ఉన్నత పా ఠశాల కేంద్రాన్ని కలెక్టర్ అశీష్ సంగ్వాన్ తనిఖీ చేశా రు. మాల్ ప్రాక్టీస్ జరగకుండా చర్యలు తీసుకోవా లని అధికారులకు సూచించారు. కలెక్టర్ వెంట కామారెడ్డి తహసీల్దార్ జనార్దన్ ఉన్నారు.
పరీక్ష కేంద్రం తనిఖీ
కామారెడ్డి క్రైం: జిల్లా కేంద్రంలోని జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పదో తరగతి పరీక్ష కేంద్రాన్ని ఎస్పీ రాజేశ్ చంద్ర శుక్రవారం పరిశీలించారు. విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ట్రాఫిక్ నియంత్రణ చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా బందోబస్తు చేపట్టాలన్నారు. ఏఎస్పీ చైతన్యరెడ్డి, పట్టణ ఎస్‌హెచ్‌వో చంద్రశేఖర్‌రెడ్డి, ఎస్బీ సీఐ తిరుపయ్య, సిబ్బంది పాల్గొన్నారు.
ఎస్సెస్సీ పరీక్షలు ప్రారంభం