● అవసరాలే వ్యాపార వనరులు ● ఆర్థికంగా నిలదొక్కుకుంటున్న మహిళలు
మిల్లెట్స్ వ్యాపారం
దుకాణం నిర్వహిస్తున్న యాస్మిన్ బేగం
బీర్కూర్ మండల కేంద్రానికి చెందిన యాస్మిన్ బేగం కుటుంబానికి పిండి గి ర్నీ ఉంది. తోడుగా ఏదైనా వ్యాపారం చేయాలనుకుని రాగులు, జొన్నలు తదితర మిల్లె ట్స్ వ్యాపారం మొదలుపెట్టింది. రోజుకు రూ.3వేల నుంచి రూ.5వేల వరకు వ్యాపా రం నడుస్తోంది. దీని ద్వారా రోజుకు రూ. 800 నుంచి రూ.900 సంపాదిస్తున్నారు. నా లుగు చక్రాల రవాణా వాహనం కొనుగోలు చేశారు. సొంతంగా అటుకులు, పేలాలు, బ ఠానీలు, చుడువా అటుకులు తయారు చేస్తున్నారు. పేలాల రోస్టర్ మిషన్ తీసుకోవాలని భావిస్తున్నట్లు యాస్మిన్ బేగం తెలిపారు.