
నవీపేటలో సైబర్ మోసం
నవీపేట: మండల కేంద్రంలో ఓ వ్యక్తి సైబర్ మోసానికి గురైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎస్సై వినయ్ తెలిపిన వివరాలు ఇలా.. నవీపేట శివారులోని సాయికృప పెట్రోల్ బంక్‌లో ఈనెల 1న ఓ వ్యక్తి డీజిల్ పోయించుకొని, రూ.3370ను ఫోన్‌పే చేశాడు. కానీ ట్రాన్సక్షన్ ఫెయిల్ అయిందని క్యాషియర్ సైబా వెంకటేశ్వర్ సదరు వ్యక్తికి తెలిపాడు. డబ్బులు కట్ అయ్యాయని, త్వరలో వస్తాయని అతడు క్యాషియర్‌ను నమ్మించాడు. అనంతరం క్యాషియర్ ఫోన్‌కు ఓ వ్యక్తి కాల్ చేసి ఎస్‌బీఐ నుంచి మాట్లాడుతున్నట్లు తెలిపాడు. డబ్బుల కోసం ఒక ఫైల్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించగా, వారు చెప్పిన విధంగా ప్రాసెస్ చేశాడు. కొద్దిసేపటికీ విడతల వారీగా అతడి అకౌంట్ నుంచి రూ.70వేలు డ్రా అయినట్లు మెసేజ్ వచ్చింది. దీంతో కాల్ చేసిన వారిని సంప్రదించడానికి ప్రయత్నించగా రిప్లయ్ రాలేదు. వెంటనే మోసపోయానని గుర్తించి, సైబర్‌క్రైమ్ నంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశాడు. ఆదివారం పోలీసులకు ఫిర్యాద చేయగా వారు కేసు నమోదు చేసుకున్నారు.
న్యూసెన్స్ చేసిన
యువకులపై కేసు నమోదు
ఎల్లారెడ్డి: పట్టణంలోని నడి రోడ్డులో శనివారం రాత్రి బర్త్‌డే పార్టీ పేరిట కేక్ కట్ చేస్తూ న్యూసెన్స్ క్రియేట్ చేసిన యువకులపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై మహేష్ తెలిపారు. రోడ్డుపై కేక్ కట్ చేసిన వారితోపాటు వారి తల్లిదండ్రులకు ఆదివారం కౌన్సెలింగ్ నిర్వహించారు. రోడ్డుపై న్యూసెన్సు చేస్తే కఠిన చర్యలుంటాయని, కేసులు నమోదు చేస్తామని ఎస్సై అన్నారు.