
రసవత్తరంగా కుస్తీ పోటీలు
రెంజల్(బోధన్): మండలంలోని కందకుర్తి గ్రామంలో శ్రీరామనవమి పండుగ సందర్భంగా ఆదివారం నిర్వహించిన కుస్తీపోటీలు రసవత్తరంగా సాగాయి. పోటీలకు మహారాష్ట్రకు చెందిన మల్లయోధులు పె ద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చివరి కుస్తీకి పది తులా ల వెండి కడియం, ద్వితీయ కుస్తీకి ఐదు తుల వెండి కడియాన్ని విజేతలకు అందించారు. మాజీ స ర్పంచ్ ఖలీమ్‌బేగ్, మాజీ ఉప సర్పంచ్ యోగేష్‌లు మల్లయోధులకు బహుమతులను అందజేశారు.
రుద్రూర్: కోటగిరి మండల కేంద్రంలో మున్నూరుకాపు సంఘం ఆధ్వర్యంలో కుస్తీపోటీలు నిర్వహించారు. కుస్తీ పోటీలకు వివిధ గ్రామాల నుంచి మల్లయోధులు తరలివచ్చి హోరాహోరీగా తలపడ్డారు. విజేతలకు నిర్వాహకులు బహుమతులు అందజేశారు.
వర్ని: మండలంలోని గోవూరు గ్రామంలో గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో కుస్తీపోటీలను నిర్వహించారు. పోటీలలో పాల్గొనటానికి చుట్టుపక్కల గ్రామాల మల్లయోధులు, మహారాష్ట్రకు చెందిన మల్లయోధులు పాల్గొన్నారు. విజేతలకు నిర్వాహకులు బహుమతులను అందజేశారు.

రసవత్తరంగా కుస్తీ పోటీలు