నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): నాగిరెడ్డిపేటలోని జగ్గనిచెరువు నీరు కలుషితం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరుతూ గ్రామస్తులు సోమవారం తహసీల్దార్ శ్రీనివాస్‌రావుకు వినతిపత్రాన్ని అందజేశారు.ఈసందర్భంగా వారు మాట్లాడుతూ గోపాల్‌పేటలోని ప్రధాన రహదారికిరువైపులా ఉన్న ఇళ్ల నుంచి వెలువడే మురుగు, వ్యర్థపదార్థాలు పోచారం ప్రధాన కాలువలో కలపడంతో తమ గ్రామసమీపంలోని జగ్గనిచెరువునీరు కలుషితమవుతుందన్నారు. దీంతో పలువురు జీవనాధారం కోల్పొతారని ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం నీరుపారుదలశాఖ ఏఈ శ్రీకాంత్‌కు సైతం వినపత్రాన్ని సమర్పించారు.