
అల్మాజీపూర్‌లో బోనాల పండుగ
ఎల్లారెడ్డి: అల్మాజీపూర్ గ్రామంలో సోమవా రం బోనాల పండుగ నిర్వహించారు. శ్రీరామనవమి ఉత్సవంలో భాగంగా గ్రామంలోని ముత్యాల పోచమ్మ, నల్ల పోచమ్మ అమ్మవార్లకు మహిళలు బోనాలతో శోభాయాత్ర నిర్వహించి అమ్మవారికి బోనాలను సమర్పించారు. అందరూ సల్లంగా ఉండాలని అమ్మవారిని వేడుకున్నారు.
చిన్నారులకు కంటి పరీక్షలు
కామారెడ్డి టౌన్: జిల్లాలో వైద్య ఆరోగ్యశాఖ, ఆర్‌బీఎస్‌కే ఆధ్వర్యంలో అంగన్‌వాడీ కేంద్రాలలో చిన్నారులకు కంటి పరీక్షల కార్యక్రమాన్ని సోమవారం ప్రారంభించారు. మొదటి రోజు జిల్లాలో 1,077 మందికి కంటి స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు. రెండు దశలలో కంటి పరీక్షలు నిర్వహిస్తామని డీఎంహెచ్‌వో చంద్రశేఖర్ తెలిపారు. మొదటి దశలో స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించి రెండో దశలో అవసరమైన చిన్నారులకు కంటి అద్దాల పంపిణీ, శస్త్ర చికిత్సలు చేపడుతామని పేర్కొన్నారు. అలాగే మానసిక పరీక్షలు కూడా చేస్తామన్నారు. జిల్లాలోని 1,205 అంగన్‌వాడీ కేంద్రాలలో చిన్నారులందరికి పరీక్షలు చేస్తామని, ఇందుకు తల్లిదండ్రులు సహకరించాలని కోరారు.
కొనుగోలు కేంద్రాల్లోనే అమ్మాలి
కామారెడ్డి రూరల్: ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు ధాన్యం విక్రయించాలని డీసీవో రామ్మోహన్ సూచించారు. సోమవారం గర్గుల్, నర్సన్నపల్లి, ఉగ్రవాయి, ఇస్రోజీవాడి, చిన్నమల్లారెడ్డి, అడ్లూర్ ఎస్సీ కాలనీ గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు నిబంధనల ప్రకారం ధాన్యాన్ని కేంద్రాలకు తీసుకువచ్చి ప్రభుత్వం కల్పించే మద్దతు ధరను పొందాలని సూచించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ధర్మగోని లక్ష్మీరాజాగౌడ్, మానిటరింగ్ ఆఫీసర్ షేక్ చాంద్, పీఏసీఎస్ వైస్ చైర్మన్ బొంబొతుల శంకర్‌గౌడ్, డైరెక్టర్లు గంగాగౌడ్, రాంరెడ్డి, లక్ష్మీనారాయణ, దుబ్బాక పోచయ్య, కల్లూరి భూమయ్య, సీఈవో సతీష్, మాజీ సీఈవో మోహన్‌రావు తదితరులు పాల్గొన్నారు.
వందశాతం ఇంటి పన్నులు
వసూలు చేయాలి
భిక్కనూరు: గ్రామపంచాయతీలు వంద శాతం ఇంటిపన్నులను వసూలు చేస్తే వేగంగా అభివృద్ధి సాధించవచ్చని డీపీవో మురళి పేర్కొన్నారు. సోమవారం ఆయన పెద్దమల్లారెడ్డిని సందర్శించారు. తడి పొడి చెత్తను వేరువేరుగా అందించడంపై ప్రజలకు అవగాహన కల్పించాలని పారిశుధ్య సిబ్బందికి సూచించారు. నీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని పంచాయతీ కార్యదర్శికి సూచించారు. కమ్యూనిటీ బోర్‌ల వద్ద నీరు వృథాగా పోకుండా చర్యలు తీసుకోవడంతో పాటు అక్కడ పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చూడాలన్నారు. డీపీవో వెంట ఈవో లక్ష్మి ఉన్నారు.
గిరిజన నాయకుల ముందస్తు అరెస్టు
కామారెడ్డి టౌన్ : గిరిజన భవనం ముట్టడి ని అడ్డుకునేందుకు గిరిజన సంఘం జిల్లా నాయకులను సోమవారం పట్టణ పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మోతీరాం నాయక్, గిరిజన విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు వినోద్‌లను ఉదయం అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. మధ్యాహ్నం సొంత పూచికత్తుపై విడుదల చేశారు.

అల్మాజీపూర్‌లో బోనాల పండుగ

అల్మాజీపూర్‌లో బోనాల పండుగ

అల్మాజీపూర్‌లో బోనాల పండుగ