
గుండెపోటుతో యువకుడి మృతి
ఎల్లారెడ్డిరూరల్: ఎల్లారెడ్డి మండలం బిక్కనూర్ గ్రామానికి చెందిన సందీప్‌రెడ్డి(25) అనే యువకుడు గుండెపోటుతో మృతి చెందినట్లు గ్రామస్తులు మంగళవారం తెలిపారు. గ్రామానికి చెందిన సునీత–మహేశ్వర్‌రెడ్డి దంపతుల రెండో కుమారుడు సందీప్‌రెడ్డికి పుట్టుకతోనే గుండెకు రంధ్రం ఉంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో 2004లో రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా గుండెకు సర్జరీ చేశారు. 20 ఏళ్ల తరువాత మళ్లీ ఆపరేషన్ చేయాలని వైద్యులు సూచించడంతో నాలుగు రోజుల క్రితం గుండె ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ అనంతరం సోమవారం రాత్రి గుండె పోటు రావడంతో మృతి చెందాడు.