
మురికికూపంగా బస్టాండ్
బిచ్కుంద(జుక్కల్) : మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ నుంచి ప్రతిరోజు వేల మంది ప్రయాణిస్తారు. అధికారులు కనీస సౌకర్యాలు కల్పించడంలో విఫలమవుతున్నారు. బస్టాండ్ ఆవరణలో మురికి నీరు చేరి భరించలేని దుర్గంధం వ్యాపిస్తోంది. మురికిలో పందులు పడుకుంటున్నాయి. బస్టాండ్ పర్యవేక్షణ చూస్తున్న ఆర్టీసీ అధికారులు మురికిని చూస్తున్నప్పటికీ తమకేమి పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. మురికితో దుర్వాసన వస్తుందని, ఇబ్బందులు పడుతున్నామని పంచాయతీ, ఆర్టీసీ అధికారుల దృష్టికి సమస్య తీసుకెళ్లిన పట్టించుకోవడం లేదని ప్రయాణికులు, చుట్టుపక్కల దుకాణాల యజమానులు ఆవేదన వ్యక్తం చేశారు. బస్టాండ్‌లోని స్టాల్స్ ద్వారా ఆర్టీసీకి ఆదాయం వస్తున్న కనీస సౌకర్యాల కల్పించడం లేదని ప్రయాణికులు విమర్శిస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి బస్టాండ్‌లో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని ప్రయాణికులు కోరుతున్నారు.
పట్టించుకోని ఆర్టీసీ,
బిచ్కుంద జీపీ అధికారులు
ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు