
వందశాతం ఇంటిపన్ను వసూలు చేయాలి
ఎల్లారెడ్డి: ఇంటి పన్నులను వందశాతం వసూలు చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చందర్‌నాయక్ అన్నారు. గురువారం ఎల్లారెడ్డి మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ సిబ్బందితో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతు ఇందిరమ్మ ఇళ్ల సర్వేను వార్డుల వారీగా నిర్వహించాలన్నారు. పారిశుధ్యంపై తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మహేష్‌కుమార్, సిబ్బంది తదితరులున్నారు.
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వేగవంతం చేయాలి
లింగంపేట(ఎల్లారెడ్డి): ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పనులు వేగవంతం చేయాలని అదనపు కలెక్టర్ చందర్‌నాయక్ లబ్ధిదారులకు సూచించారు. గురువారం ఆయన లింగంపేట మండలం ఎల్లారం గ్రామంలో మార్కౌట్ చేసిన ఇందిరమ్మ ఇళ్లకు భూమిపూజ చేశారు.ఎల్లారం గ్రామానికి 45 ఇళ్లు మంజూరు కాగా, 12 మంది లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభించినట్లు అధికారులు అ దనపు కలెక్టర్‌కు వివరించారు. ఎంపీడీవో నరేష్, ఎ ంపీవో మలహరి, కార్యదర్శి, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.
కొనుగోలు కేంద్రం పరిశీలన
నస్రుల్లాబాద్: మండలంలోని అంకోల్ గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని అదనపు కలెక్టర్ చందర్ నాయక్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలన్నారు. ఎంపీడీవో సూర్యకాంత్, ఐకేపీ ఏపీఎం గంగాధర్, రైతులు ఉన్నారు.