
ఫిర్యాదులను సత్వరమే పరిష్కరిస్తాం
సీజీఆర్‌ఎఫ్ చైర్మన్ ఎరుకల నారాయణ
లింగంపేట(ఎల్లారెడ్డి): విద్యుత్ వినియోగదారులు, రైతుల నుంచి ఫిర్యాదులు వస్తే సత్వరమే పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక (సీజీఆర్‌ఎఫ్) చైర్మన్ ఎరుకల నారాయణ అన్నారు. మండల కేంద్రంలోని సబ్ స్టేషన్ కార్యాలయంలో గురువారం విద్యుత్ వినియోగదారుల పరిష్కార వేదిక సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. గాంధారి మండలం సర్వాపూర్, లింగంపేట మండలం శెట్పల్లిసంగారెడ్డి, మెంగారం, మోతె, నల్లమడుగు, బాణాపూర్, పర్మళ్ల గ్రామాల నుంచి ఎక్కువ ఫిర్యాదులు వచ్చాయన్నారు. సమస్యలను వెంటనే పరిష్కరించాలని విద్యుత్ సిబ్బందికి సూచించారు. సిబ్బంది గ్రామాల్లో వినియోగదారులకు అందుబాటులో ఉండాలన్నారు. పరిష్కార వేధికలో లూజ్ లైన్, ఓవర్ లోడ్, ట్రాన్స్ ఫార్మర్లు, బిల్లుల సమస్యలపై 12 ఫిర్యాదులు వచ్చినట్లు పేర్కొన్నారు. వాటికి సంబంధించిన పోల్స్, పరికరాలు సిద్ధం చేసి 15 రోజుల్లో పరిష్కరిస్తామన్నారు. కార్యక్రమంలో ఎస్‌ఈ శ్రావణ్‌కుమార్, డీఈఈ విజయసారథి, ఏడీఈ మల్లేశం, ఏఈలు సాయినాథ్, హరీష్‌రావు, లక్ష్మన్, నాలుగు సెక్షన్‌ల పరిధిలోని ట్రాన్స్‌కో సబ్బంది, రైతులు పాల్గొన్నారు.