
‘శోభాయాత్ర ప్రశాంతంగా నిర్వహించాలి’
కామారెడ్డి క్రైం: పట్టణంలో శనివారం జరిగే వీర హనుమాన్ శోభాయాత్రను ప్రశాంతంగా నిర్వహించాలని ఎస్పీ రాజేశ్ చంద్ర సూచించారు. శుక్రవారం ఆయన వీహెచ్‌పీ నాయకులతో కలిసి జిల్లా కేంద్రంలో శోభాయత్ర జరిగే ప్రాంతాలను పరిశీలించారు. కోడూరి హనుమాన్ ఆలయం నుంచి బడా మజీద్, రైల్వే బ్రిడ్జి, నిజాంసాగర్ చౌరస్తా, స్టేషన్ రోడ్, ధర్మశాల, సుభాష్ రోడ్, వీక్లీ మార్కెట్ తదితర ప్రాంతాల్లో పర్యటించి అధికారులకు పలు సూచనలు ఇచ్చారు. అనంతరం పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. హనుమాన్ జయంతి ర్యాలీని పండుగ వాతావరణంలో జరుపుకోవాలన్నారు. ఏవైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మున్సిపల్, విద్యుత్, పోలీసు అధికారులకు సూచించారు. కార్యక్రమంలో ఏఎస్పీ చైతన్యరెడ్డి, పట్టణ ఎస్‌హెచ్‌వో చంద్రశేఖర్‌రెడ్డి, వీహెచ్‌పీ జిల్లా అధ్యక్షుడు నిత్యానందం, ప్రతినిధులు గోపాలకృష్ణ, బొల్లి రాజు, బజరంగ్‌దళ్ ప్రతినిధులు వివేకానంద, అశోక్, వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు.