
భారత్‌ను విశ్వగురువుగా నిలబెట్టడమే బీజేపీ లక్ష్యం
రాజంపేట/కామారెడ్డి రూరల్/భిక్కనూరు : భారత్‌ను విశ్వగురువుగా నిలబెట్టడమే బీజేపీ లక్ష్యమని, ఇందుకు మోదీతో పాటు ప్రతి కార్యకర్త నిరంతరం శ్రమిస్తూనే ఉన్నారని రాజంపేట మండల బీజేపీ పార్టీ అధ్యక్షుడు సంపత్‌రెడ్డి అన్నారు. మండల శాఖ ఆధ్వర్యంలో పొందుర్తి శాఖ ఆధ్వర్యంలో, కామారెడ్డి మండలం చిన్న మల్లారెడ్డి శాఖ ఆధ్వర్యంలో, భిక్కనూరు మండలం పెద్దమల్లారెడ్డి గ్రామంలో ‘గావ్ చలో బస్తీ చలో’ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం బూత్ కమిటీల సమావేశంలో బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ కుంటా లక్ష్మారెడ్డి, బీజేపీ జిల్లా కార్యదర్శి రాయపల్లి సంతోష్‌రెడ్డి, రాజంపేట మండల బీజేపీ పార్టీ అధ్యక్షుడు సంపత్‌రెడ్డిలు మాట్లాడారు.పెద్దమల్లారెడ్డి గ్రామంలో నల్ల పోచమ్మ ఆలయం వద్ద నాయకులు స్వచ్ఛభారత్ కార్యక్రమం నిర్వహించారు. కేంద్రం ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనుల కరపత్రాలను పలు చోట్ల పంపిణీ చేశారు. భిక్కనూరు మండల బీజేపీ పార్టీ అధ్యక్షులు రమేష్, నియోజకవర్గ ఇన్‌చార్జి శ్రీధర్‌రెడ్డి, రాజంపేట మండల బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.