
అంగన్‌వాడీ కేంద్రం తనిఖీ
లింగంపేట(ఎల్లారెడ్డి): మండలంలోని కొర్పోల్ గ్రామంలోగల అంగన్‌వాడీ కేంద్రాన్ని మంగళవారం ఎంపీవో మలహరి తనిఖీ చేశారు. విద్యార్థులు, టీచర్ హాజరు పట్టికలను పరిశీలించారు. అనంతరం గ్రామ శివారులోని వైకుంఠధామం, కంపోస్టు షెడ్డు, పల్లె ప్రకృతి వనం, నర్సరీలను పరిశీలించారు.
ఉద్యమకారుడికి పరామర్శ
బాన్సువాడ రూరల్: ఇటీవల అనారోగ్యానికి గురైన తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు దండు విజయ్‌కుమార్‌ను మంగళవారం ఎమ్మెల్సీ కవిత పరామర్శించారు. బాన్సువాడలోని జర్నలిస్టు కాలనీలో దండు విజయ్‌కుమార్ ఇంటికి వెళ్లి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, నాయకులు గంగాధర్, సాయిబాబా, చందు, రాజు, గైని గంగారాం, భాస్కర్‌గౌడ్, ఖాదర్, మహేష్, కృష్ణ తదితరులు ఉన్నారు.

అంగన్‌వాడీ కేంద్రం తనిఖీ