
చెరువు నుంచి అక్రమంగా మట్టి తరలింపు
గాంధారి(ఎల్లారెడ్డి): మండల పరిధిలోని నాగ్లూర్ చెరువు నుంచి కొందరు నాయకులు అక్రమంగా నల్ల మట్టిని తరలిస్తున్నారని నాగ్లూర్ గ్రామస్తులు అన్నారు. మట్టి తరలింపును వెంటనే నిలిపివేయాలని కోరుతూ బుధవారం తహసీల్దార్ రేణుక చౌహాన్‌కు వినతి పత్రం ఇచ్చారు. ఈవిషయమై రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని, అలాగే చెరువు కట్టపై ఉన్న దారిని ఆక్రమించారని వారు ఆరోపించారు.
ఇరిగేషన్ ఏఈ వంశీ నిర్లక్ష్యంతో మట్టిని తరలిస్తున్నారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక నుంచి చెరువులో నుంచి మట్టిని తరలించకుండా చర్యలు తీసుకుంటామని ఏఈ వంశి గ్రామస్తులకు హామీ పత్రం రాసి ఇచ్చారు. చెరువు ను సర్వే చేయించి హద్దులు నిర్ణయిస్తామని తహసీల్దార్ హామీ ఇవ్వడంతో గ్రామస్తులు శాంతించారు. వీలైనంత తొందరగా సర్వే చేయించి చెరువు విస్తీర్ణం నిర్ణయించాలని గ్రామస్తులు కోరారు.
నిలిపివేయాలని తహసీల్దార్‌కు నాగ్లూర్ గ్రామస్తుల వినతి
నిలిపివేస్తామని హామీ పత్రం
ఇచ్చిన ఇరిగేషన్ ఏఈ వంశి

చెరువు నుంచి అక్రమంగా మట్టి తరలింపు