
రసవత్తరంగా కుస్తీ పోటీలు
బాన్సువాడ : బాన్సువాడలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో శుక్రవారం నిర్వహించిన కుస్తీ పోటీలు రసవత్తరంగా సాగాయి. బాన్సువాడ డివిజన్‌లో అతి పెద్ద జాతరగా భేతాళస్వామి జాతరకు ఆదరణ ఉంది. ఏటా ఉత్సవాల సందర్భంగా కుస్తీ పోటీలు నిర్వహిస్తారు. శుక్రవారం నిర్వహించిన జాతరలో పాల్గొని, పోటీలను తిలకించడానికి స్థానికులు, చుట్టుపక్కల గ్రామాలనుంచే కాకుండా మహారాష్ట్ర– కర్ణాటక సరిహద్దు గ్రామాల నుంచి జనం కూడా జనం తండోపతండాలుగా వచ్చారు. మల్లయోధులు కూడా అంతే ఉత్సాహంతో తొడకొట్టి తలపడ్డారు. కొబ్బరి కాయ కుస్తీతో మొదలైన పోటీలు రూ. 5,001 కుస్తీ వరకు సాగాయి. ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి పోటీలను తిలకించారు. విజేతలకు బహుమతులు అందించారు.

రసవత్తరంగా కుస్తీ పోటీలు