
ఎమ్మెల్యేకు వినతి
కామారెడ్డి అర్బన్: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల జేఏసీ(టీజీఈజేఏసీ) ఉద్యమ కార్యాచరణలో భాగంగా కేంద్ర కమిటీ పిలుపు మేరకు శనివారం జిల్లా జేఏసీ నాయకులు కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డిని కలిసి వినతి పత్రం అందజేశారు. ఉద్యోగులు, పెన్షనర్లు, ఒప్పంద, పొరుగు సేవల ఉద్యోగుల 57 సమస్యల పరిష్కరించాలని ప్రభుత్వానికి విన్నవించినా ఫలితం లేకపోవడంతో దశలవారీగా ఉద్యమబాట పట్టినట్టు జేఏసీ జిల్లా చైర్మన్ నరాల వెంకట్‌రెడ్డి ఎమ్మెల్యే వెంకట రమణరెడ్డికి వివరించగా.. తాను తప్పకుండా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతానని హామీ ఇచ్చారు. జేఏసీ సెక్రటరీ జనరల్ ఆర్.దేవేందర్, వివిధ సంఘాల నాయకులు పి.శ్రీనివాస్‌రెడ్డి, బాబు, నాగరాజు, సాయిరెడ్డి, బి.రాజు, హన్మంతురెడ్డి, దేవులా, తదితరులు పాల్గొన్నారు.