
చారిత్రక కట్టడాల విశిష్టతపై అవగాహన
దోమకొండ: ప్రపంచ వారసత్వ దినోత్సవం సందర్భంగా మండల కేంద్రంలోని గడికోట, బురుజు, ఉపగడ్డ తదితర చారిత్రక కట్టడాలపై శనివారం విద్యార్థులకు గడికోట ట్రస్టు ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముందుగా విద్యార్థులకు కట్టడాలను ప్రక్ష్యతంగా చూపించి వాటి విశిష్టతను తెలియజేశారు. గడికోట నుంచి బురుజు వరకు ర్యాలీగా వెళ్లి బురుజు కట్టడం దాని చరిత్ర వా రికి వివరించారు. గడికోట ట్రస్టు మేనేజర్ బా బ్జీ, ట్రస్టు ప్రతినిధులు గణేష్‌యాదవ్, రాజశేఖ ర్, హరీష్, కల్పన విద్యార్థులు ఉన్నారు.