
వివాహ వేడుకలో ఉమ్మడి జిల్లా నేతలు
నిజాంసాగర్: జిల్లా కేంద్రంలోని సత్య కన్వెన్షన్‌లో ఆదివారం జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ దఫేదార్ శోభ రాజు దంపతుల పెద్ద కూతురు కీర్తన వివాహం జరిగింది. వ్యవసాయశాఖ సలహాదారు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి, కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి, ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ బాల్‌రాజ్, మాజీ ఎంపీ బీబీ పాటిల్, మాజీ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, గంప గోవర్ధన్, జాజాల సురేందర్, హన్మంత్ సింధే, రవీందర్‌రెడ్డి, సౌదాగర్ గంగారాం, జనార్దన్ గౌడ్, అరుణతార, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు ముజీబొద్దీన్ తదితరులు పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు.