
గల్ఫ్‌లో తప్పిపోయిన భర్తను వెతికించండి
● ప్రజావాణిలో భార్య వినతి
రామారెడ్డి: గల్ఫ్‌లో తప్పిపోయిన భర్తపై భార్య ఆవేదన చెందుతోంది. ఈమేరకు సోమవారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన ప్రజావాణిలో ఆమె వినతి పత్రం అందజేసింది. వివరాల్లోకి వెళ్తే.. రామారెడ్డి మండలం ఇసన్నపల్లి గ్రామానికి చెందిన ఎగ్గిని బక్క మల్లవ్వ భర్త బక్క మల్లయ్య ఉపాధి నిమిత్తం పదేళ్ల కింద రూ. లక్ష అప్పు చేసి ముంబయి నుంచి మస్కట్ దేశానికి వెళ్లాడు. మంబయి విమానాశ్రయానికి బయలుదేరే ముందు భర్త ఫోన్‌లో మాట్లాడిందే చివరి మాట అని బక్కమల్లవ్వ ‘సాక్షి’తో తెలిపారు. తన భర్త ఆచూకీ కనిపెట్టి ఇండియాకు రప్పించాలని, లేనిచో తెలంగాణ ప్రభుత్వం గల్ఫ్ దేశాల్లో చనిపోయిన వారికి రూ.5 లక్షల నష్టపరిహారం ఇస్తున్న నేపథ్యంలో అందించాలని ప్రజావాణిలో వినతి ప్రతం అందించినట్లు ఆమె తెలిపారు.