
బైక్‌పై వెళ్తున్న వ్యక్తిని అటకాయించి గొడ్డలితో దాడి
మాచారెడ్డి: బైక్‌పై వెళ్తున్న వ్యక్తిని అటకాయించి గుర్తుతెలియని దుండగులు ఇనుపరాడ్లు, గొడ్డలితో దాడికి పాల్పడ్డారు. ఈఘటన సోమవారం ఫరీదుపేట, దోమకొండ శివారులో చోటు చేసుకుంది. మాచారెడ్డి ఎస్సై అనిల్ తెలిపిన వివరాలు .. మండలంలోని ఘన్‌పూర్(ఎం) గ్రామానికి చెందిన సాడెం కుమార్ తూప్రాన్ మున్సిపల్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. రోజు మాదిరిగానే తన బైక్‌పై ఫరీదుపేట మీదుగా దోమకొండ వైపు వెళ్తున్నాడు. ఫరీదుపేట, దోమకొండ గ్రామాల శివారులో రెండు బైకులు, ఒక ఆటోలో దుండగులు అతడిని వెంబడించి ఇనుపరాడ్లు, గొడ్డలితో తలపై బాదారు. కుమార్ రోడ్డు పక్కన కుప్పకూలిపోయాడు. అదే సమయంలో దోమకొండ వైపు నుంచి ఫరీదుపేటకు కారులో వస్తున్న పాల్వంచ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు రమేశ్‌గౌడ్ అతడిని గమనించి కారు ఆపాడు. దీంతో దుండగులు దోమకొండ వైపు పారిపోయారని ఎస్సై తెలిపారు. కుమార్‌కు తలపై నాలుగు చోట్ల గాయాలు కావడంతో అంబులెన్స్‌లో కామారెడ్డిలోని ఓ ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. పథకం ప్రకారం దాడి జరగడంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
యువకుడికి తీవ్ర గాయాలు