జల్సాల కోసం చోరీలు | - | Sakshi
Sakshi News home page

జల్సాల కోసం చోరీలు

Published Wed, Apr 23 2025 9:43 AM | Last Updated on Wed, Apr 23 2025 9:43 AM

జల్సాల కోసం చోరీలు

జల్సాల కోసం చోరీలు

కామారెడ్డి క్రైం: జల్సాలకు అలవాటు పడి తాళం వేసిన ఇళ్లను టార్గెట్‌ చేస్తూ చోరీలకు పాల్పడుతున్న ఓ నిందితుడిని దేవునిపల్లి పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. కామారెడ్డి సబ్‌ డివిజనల్‌ పోలీసు కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏఎస్పీ చైతన్యరెడ్డి వివరాలు వెల్లడించారు. పది రోజుల క్రితం పట్టణ శివారు కాలనీలో ఓ దొంగతనం జరిగింది. పోలీసులు విచారణ చేపట్టగా మాసాయిపేట్‌కు చెందిన పందిగోటి రామును నిందితుడిగా గుర్తించారు. అతడిని తూఫ్రాన్‌ ప్రాంతంలో మంగళవారం పట్టుకుని విచారించగా దేవునిపల్లితోపాటు నిజామాబాద్‌, బోధన్‌, మేడ్చల్‌, మనోమరాబాద్‌ పీఎస్‌ల పరిధిలో మొత్తం 9 చోట్ల చోరీలకు పాల్పడినట్లు తేలింది. దీంతో అతడికి సహకరించిన బంధాపురం మల్లేష్‌, వడ్డెర నవీన్‌, శ్యాంలాల్‌, రినివర్‌ రాజారాం, మునివర్‌ గౌతంలను సైతం అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలిస్తున్నామని ఏఎస్పీ తెలిపారు. నిందితుల వద్ద నుంచి 6 తులాల బంగారం, అర కిలో వెండి ఆభరణాలు రికవరీ చేశామన్నారు.

తాళం వేసిన ఇళ్లే టార్గెట్‌

9 కేసుల్లో నిందితుడితో పాటు మరో ఐదుగురు అరెస్ట్‌

వివరాలు వెల్లడించిన ఏఎస్పీ చైతన్యరెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement