
భిక్కనూరు మండల క్రైస్తవ సంఘం కార్యవర్గం ఎన్నిక
భిక్కనూరు: మండల క్రైస్తవ సంఘం నూతన కార్యవర్గాన్ని మంగళవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండలంలోని అన్ని గ్రామలకు చెందిన క్రైస్తవుల ప్రతినిధులు బస్వాపూర్‌లో సమావేశమై నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షునిగా కమలాకర్, ఉపాధ్యాక్షులుగా శాంతికుమార్, జోసెప్, ప్రధానకార్యదర్శిగా ఈ. కిషన్, హయకార్యదర్శిగా పి.సుధాకర్, కోషాధికారిగా ఎస్.డేవిడ్, సంయుక్తకార్యదర్శిగా కే.యాదగిరి. సలహదారులుగా ప్రశాంత్‌కుమార్, డేవిడ్‌లు ఎన్నికయ్యారు.
పాస్టర్ల కార్యవర్గం..
భిక్కనూరు మండలంలోని చర్చిల పాస్టర్లు నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా జాన్సన్ ఉపాధ్యాక్షుడిగా జోసెఫ్, ప్రధానకార్యదర్శిగా ఎన్.స్వామి, సహయకార్యదర్శిగా పౌల్, కోశాధికారిగా జెమ్స్, కార్యవర్గసభ్యులుగా పరిశుద్ధరావు, బాల్‌రాజులు ఎన్నికయ్యారు. ఈ సందర్బంగ నూతన అధ్యక్షునిగా ఎన్నికై న జాన్సన్ మాట్లాడుతూ చర్చిల అభివృద్ధికి కృషిచేస్తానన్నారు.