
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
ఆర్మూర్: ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఇతర దేశాలు, రాష్ట్రాల నుంచి వలస వచ్చిన వారికి ఇళ్లు అద్దెకు ఇచ్చే సమయంలో జాగ్రత్తలు పాటిస్తూ అద్దెకు ఇవ్వాలని ప్రొబేషనరీ ఐపీఎస్ అధికారి సాయికిరణ్ సూచించారు. పట్టణంలోని కమలానెహ్రూ కాలనీ, టీచర్స్ కాలనీల్లో బుధవారం తెల్లవారు జామున కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు, సీఐలు సత్యనారాయణ, శ్రీధర్‌రెడ్డి, తొమ్మిది మంది ఎస్సైలు తమ 110 మంది పోలీసు బలగాలతో ఆయా కాలనీని జల్లెడ పట్టారు. ప్రతీ ఇంటిలో సోదాలు నిర్వహిస్తూ 9మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. సరైన ధ్రువపత్రాలు లేని 10 బైక్‌లను, రెండు ఆటోలను స్వాధీనం చేసుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అనంతరం ప్రజలకు పలు అంశాలపై అవగాహన కల్పించారు.