
‘రైతులకు ఇబ్బందులు కలగనీయొద్దు’
భిక్కనూరు : కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఇ బ్బందులు కలగకుండా చూడాలని జిల్లా సహకార అధికారి రామ్మోహన్ సూచించారు. మంగళవారం ఆయన అంతంపల్లి, పెద్దమల్లారెడ్డిలలోని కొనుగో లు కేంద్రాలను సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అంతంపల్లి కేంద్రం వద్ద రైతుల కోసం పందిళ్లు వేయడం, తాగునీటి సౌకర్యం కల్పించడంపై విండో సీఈవో శ్రీనివాస్‌ను అభినందించారు. వేగంగా కాంటాలు పూర్తి చేసి రైస్‌మిల్లులకు పంపించాలని సూచించారు. ఆయన వెంట క్లస్టర్ అధికారి రమేశ్, మానిటరింగ్ అధికారి నగేశ్, విండో చైర్మన్‌లు వెంకట్‌రెడ్డి, రాజాగౌడ్, సీఈవో శ్రీనివాస్ ఉన్నారు.