
గాంధీ విగ్రహానికి పార్ట్ టైం అధ్యాపకుల వినతి
భిక్కనూరు: తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం ఆమోదించాలని కోరుతూ తెలంగాణ యునివర్సిటీ సౌత్‌క్యాంపస్‌లోని పార్ట్ టైం అధ్యాపకులు సోమవారం క్యాంపస్ ఆవరణలోని గాంధీ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. తమకు కనీస వేతనం కూడా ప్రభుత్వం ఇవ్వడం లేదని జీవోనంబర్ 21ను సవరించి తమ సర్వీసులను పరిగణలోకి తీసుకుని తమకు ఉద్యోగ భఽద్రత కల్పించేలా చూడాలన్నారు.
పదో రోజుకు చేరిన కాంట్రాక్టు అధ్యాపకుల సమ్మె
ఉద్యోగభద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ యునివర్సిటీల కాంట్రాక్టు అధ్యాపకులు చేపట్టిన సమ్మె పదో రోజుకు చేరుకుంది. సోమవారం సౌత్‌క్యాంపస్‌లో దీక్ష శిబిరంలో కూర్చున్న కాంట్రాక్టు అధ్యాపకులకు మద్దతుగా పలువురు విద్యార్థి సంఘాల ప్రతినిధులు వచ్చి సంఘీభావం తెలిపారు.