
సైబర్ నేరాలపై అవగాహన
లింగంపేట(ఎల్లారెడ్డి): మండల కేంద్రంలోని బస్టాండులో సోమవారం ఏఎస్సై ప్రకాశ్‌నాయక్ సైబర్ నేరాలపై ప్రయాణికులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అపరిచితులకు బ్యాంకు ఖాతా నంబర్లు ఇవ్వద్దన్నారు. ప్రయాణం చేసే సమయంలో విలువైన వస్తువులు, డబ్బులు జాగ్రత్తగా చూసుకోవాలన్నారు. సెల్ ఫోన్లు పోయినా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.మత్తు పదార్థాలకు బానిసలు కావద్దన్నారు. వాహనాలు నడిపేవారు హెల్మెట్ ధరించి, ధువ్రపత్రాలు వెంట పెట్టుకోవాలని సూచించారు. కానిస్టేబుల్స్ తదితరులు పాల్గొన్నారు.