కోరుట్ల: కోరుట్ల పట్టణంలోని తిలక్‌రోడ్‌కు చెందిన గుంటుక కమలాకర్(45) శనివారం రాత్రి పట్టణంలోని తాళ్ల చెరువు వద్ద ఉన్న గంగమ్మ గుడి ఇనుప ఊచలకు ఉరేసుకుని చనిపోయినట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. కమలాకర్ కొంతకాలంగా హైదరాబాద్‌లో నివాసముంటూ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నట్లు సమాచారం.
బిజినెస్‌లో నష్టాలు రావడంతోపాటు కొంత కాలంగా కడుపునొప్పి సమస్య ఉండటంతో జీవితంపై విరక్తి చెంది శనివారం రాత్రి తాళ్లచెరువు గంగమ్మ గుడి వద్ద ఉరేసుకున్నాడు. ఆదివారం వేకువజామున సమీప ప్రజలు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. భార్య జయశ్రీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment