వ్యవసాయంలో నూతన ఆవిష్కరణలకు పెద్దపీట
జగిత్యాలఅగ్రికల్చర్: వ్యవసాయ రంగంలో నూత న ఆవిష్కరణలకు పెద్దపీట వేస్తున్నట్లు జగిత్యాల వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ భారతీ నా రాయణ్ భట్ అన్నారు. పొలాస వ్యవసాయ పరిశోధన స్థానంలో శనివారం ‘గ్రామీణ ఆవిష్కరణ స్పో క్, అగ్రి ఇన్నోవేషన్ క్లబ్ ఆధ్వర్యంలో ఆగ్‌మాఫ్ అగ్రి టెక్ మార్కెట్ యాక్సెస్’ నిర్వహించారు. భార తీ మాట్లాడుతూ.. వ్యవసాయ రంగంలో ఆధునిక టెక్నాలజీతో వస్తున్న వివిధ కంపెనీల సేవలను రై తులు ఉపయోగించుకోవాలన్నారు. చాలా స్టార్టప్ కంపెనీలు రైతుల ఆదాయాన్ని పెంచేందుకు.. ఖ ర్చు తగ్గించేందుకు రకరకాల కొత్త ఆవిష్కరణలతో వస్తున్నారని, వారి సేవలను వినియోగించుకోవాల ని కోరారు. వ్యవసాయ పరిశోధన స్థానం ఇన్‌చార్జి డైరెక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. వ్యవసాయంలో కూలీల ఖర్చు పెరిగినందున కూలీలు లేని వ్యవసాయాన్ని ఆవిష్కరించేందుకు పరిశోధనలు చేస్తున్నామని వివరించారు. ఆగ్‌హబ్ సీఈఓ విజయ్ అగ్రికల్చర్ హబ్ చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు. నాబార్డు ఏజీఎం జయప్రకాష్, రూరల్ ఇ న్నోవేషన్ స్పోక్ కన్వీనర్ రజనీదేవి, జగిత్యాల, కా మారెడ్డి, సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాల రైతు ఉత్పత్తి దారుల సంఘాల సభ్యులు, అగ్రిహబ్ ప్రాజెక్టు మే నేజర్ ముఖేష్, రంజిత్‌కుమార్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment