ఓటెత్తిన చైతన్యం | - | Sakshi
Sakshi News home page

ఓటెత్తిన చైతన్యం

Published Fri, Feb 28 2025 1:43 AM | Last Updated on Fri, Feb 28 2025 1:39 AM

ఓటెత్

ఓటెత్తిన చైతన్యం

2019 ఏడాదితో పోలిస్తే మెరుగుపడిన ఎమ్మెల్సీ ఓటింగ్‌

11.39 శాతం పెరిగిన పట్టభద్రులు, 8.36శాతం పెరిగిన టీచర్లు

మూడో తేదీన లెక్కింపు, ఏర్పాట్లు ముమ్మరం

విజయావకాశాలపై మొదలైన ఆన్‌లైన్‌ సర్వేలు

ఓటేసేందుకు డల్లాస్‌ నుంచి వచ్చిన శ్రీరామోజు అఖిల

సాక్షిప్రతినిధి,కరీంనగర్‌:

ఉమ్మడి కరీంనగర్‌– మెదక్‌– ఆదిలాబాద్‌– నిజా మాబాద్‌ జిల్లాల గ్రాడ్యుయేట్‌, టీచర్‌ నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈసారి ఓటింగ్‌శాతం పెరి గింది. ఎన్నికల సంఘం చేసిన ప్రచారం, అభ్యర్థులు చేపట్టిన ఓటింగ్‌ నమోదు పోలింగ్‌శాతం పెరుగుదలకు దోహదం చేసింది. గురువారం నాలుగు పాత జిల్లా(కొత్త 15 జిల్లాలు)లు, 42నియోజకవర్గాల్లోని 773 పోలింగ్‌ కేంద్రాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. పట్టభద్రుల ఎమ్మెల్సీస్థానంలో 3,55,159 ఓట్లు ఉండగా.. 70.42శాతం పోలింగ్‌ నమోదైంది. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానంలో 27,088 మంది ఓటర్లు ఉండగా 91.90 శాతం పోలింగ్‌ నమోదైంది. గతంతో పోలిస్తే ఈసారి పట్టభద్రుల్లో 11.39శాతం, టీచర్లలో 8.36 శాతం పోలింగ్‌ మెరుగైంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ బరిలో ఉన్న 56మంది, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పోటీలో నిలిచిన 15మంది భవితవ్యం బ్యాలెట్‌ బాక్సుల్లో నిక్షిప్తమై ఉంది. బ్యాలెట్‌ బాక్సులు కరీంనగర్‌లోని అంబేడ్కర్‌ స్టేడియంలోని స్ట్రాంగ్‌రూముల్లో భద్రపరచగా.. మార్చి మూడో తేదీన ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు చేశారు. పోలింగ్‌ ముగిసిన నేపథ్యంలో విజయావకాశాలపై సర్వేలు జోరందుకున్నాయి.

ప్రతికూలతతో తగ్గిన ఓటింగ్‌..

వాస్తవానికి ఈసారి పోలింగ్‌ ఇంకా పెరగాల్సి ఉన్నా.. పలు ప్రతికూలతల వల్ల అది సాధ్యం కాలేదు. టీచర్లకు ప్రభుత్వం స్పెషల్‌ క్యాజువల్‌ లీవు పేరిట రోజు మొత్తం సెలవు ఇచ్చింది. కానీ, విద్యాశాఖ, ప్రైవేటు యాజమాన్యాలు కాలడ్డం పెట్టాయి. ప్రభుత్వ స్కూళ్ల ఉపాధ్యాయులకు సగంరోజు, ప్రైవేటు వారికి గంట మాత్రమే అనుమతించారు. వాస్తవానికి టీచర్లు గ్రాడ్యుయేట్‌, టీచర్‌ రెండు ఓట్లు వేయాల్సి ఉంటంది. కానీ, సమయాభావం, సెలవు దొరక్కపోవడంతో వారిలో అధికశాతం ఒక్క ఓటుకే పరిమితమయ్యారు. దీనికితోడు ముందు రోజు రాత్రి శివరాత్రి జాగారం కావడం పలువురు పుణ్యక్షేత్రాలకు వెళ్లారు. ఇక హైదరాబాద్‌, తదితర నగరాలకు వలసవెళ్లిన గ్రాడ్యుయేట్లు, టీచర్లకు ఇక్కడ ఓటు ఉన్నా.. సెలవు దొరక్క, చార్జీల భారం వల్ల రాలేకపోయారు.

ఓటేసిన కలెక్టర్‌.. 3వ తేదీన లెక్కింపు

కరీంనగర్‌లోని ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌స్టేషన్లను ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి, కరీంనగర్‌ కలెక్టర్‌ పమేలా సత్పతి సందర్శించారు. ముకరంపురలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఆమె తన గ్రాడ్యుయేట్‌ ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఇదే పోలింగ్‌ కేంద్రంలో అడిషనల్‌ కలెక్టర్‌ ప్రఫుల్‌ దేశాయ్‌ ఓటు వేశారు. మార్చి 3వ తేదీన ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నారు. కరీంనగర్‌లోని బీఆర్‌ అంబేడ్కర్‌ ఇండోర్‌ స్టేడియంలో లెక్కింపు కోసం ఏర్పాట్లు చేపడుతున్నారు. పటిష్టమైన బందోబస్తు మధ్య లెక్కింపు జరగనుంది. కొత్త 15 జిల్లాల నుంచి గురువారం అర్ధరాత్రి వరకు బ్యాలెట్‌ బాక్సులు స్ట్రాంగ్‌ రూములకు చేరుకున్నాయి. పోలింగ్‌ ముగిసిన మరుక్షణమే ఆన్‌లైన్‌లో ఎగ్జిట్‌పోల్‌ కోసం అభిప్రాయ సేకరణ ప్రారంభించారు. ఫోన్లలో ఐవీఆర్‌ పద్ధతిలో, నేరుగా, సోషల్‌మీడియా లేదా ఆన్‌లైన్‌లో అభిప్రాయాలు సేకరించడం మొదలు పెట్టారు.

గ్రాడ్యుయేట్స్‌ స్థానంలో పోలింగ్‌ ఇలా..

ఏడాది మొత్తం ఓట్లు పోలింగ్‌శాతం

2019 1,95,581 59.03శాతం

2025 3,55,159 70.42శాతం

టీచర్స్‌ స్థానంలో

ఏడాది మొత్తం ఓట్లు పోలింగ్‌శాతం 2019 23,160 83.54 శాతం

2025 27,088 91.90 శాతం

పట్టభద్రుల ఎమ్మెల్సీ పోలింగ్‌ వివరాలు

జిల్లా మొత్తం పోలైన శాతం

ఓట్లు ఓట్లు

జగిత్యాల 35,281 24,862 70.47

పెద్దపల్లి 31,037 21,259 68.50

కరీంనగర్‌ 71,545 46,247 64.64

రాజన్న సిరిసిల్ల 22,397 15,394 68.73

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పోలింగ్‌ వివరాలు

జిల్లా మొత్తం పోలైన శాతం

ఓట్లు ఓట్లు

జగిత్యాల 1,769 1,635 92.43

పెద్దపల్లి 1,111 1,049 94.42

కరీంనగర్‌ 4,305 3,871 89.92

రాజన్న సిరిసిల్ల 950 899 94.63

No comments yet. Be the first to comment!
Add a comment
ఓటెత్తిన చైతన్యం1
1/1

ఓటెత్తిన చైతన్యం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement