పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన సీపీ
తిమ్మాపూర్: కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరిగిందని సీపీ అభిషేక్ మహంతి తెలిపారు. ఎల్‌ఎండీకాలనీలోని పోలింగ్ కేంద్రాన్ని గురువారం సందర్శించారు. పోలీసులతో మాట్లాడారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. కమిషనరేట్ పరిధిలో పోలింగ్ ప్రశాంతంగా జరిగిందన్నారు. 400 మంది పోలీసులు పోలింగ్ కేంద్రాల వద్ద, ఎస్కార్ట్ ఫోర్స్ వివిధ విభాగాలుగా విధులు నిర్వహించాయన్నారు. స్థానిక పోలీసులు పోలింగ్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తు నిర్వహించినట్లు వివరించారు. ఏసీపీ జి.నరేందర్, సీఐ స్వామి, ఎస్సై వివేక్ సీపీ వెంట ఉన్నారు.
శ్రీఅమృతేశ్వర మహా శివాలయంలో అన్నపూజ
కొత్తపల్లి: మహా శివరాత్రి వేడుకల్లో భాగంగా గురువారం రేకుర్తిలోని శ్రీ అమృతేశ్వర మహాశివాలయంలో అన్నపూజ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. పరమేశ్వరుడికి అన్న సమర్పణ చేసిన అర్చకుడు మహాహారతితో నివేదించారు. మహాశివరాత్రి పర్వదినం మరుసటి రోజున శ్రీ అపర్ణఅమృతేశ్వరస్వామికి అన్నపూజ నిర్వహించి మహాహారతి సమర్పించారు. తదనంతరం భక్తులందరికీ మహాప్రసాదం అందజేశారు. చెక్కబండి మంజుల మధుసూదన్ రెడ్డి దంపతులు అన్నప్రసాద వితరణ చేసిన ఈ కార్యక్రమంలో సుమారు రెండువేల వరకు భక్తులు పాల్గొని స్వామివారి అన్నప్రసాదం స్వీకరించారు. మాజీ కార్పొరేటర్ సుదగోని మాధవికృష్ణగౌడ్, మాజీ ఎంపీటీసీ జక్కుల నాగరాణి మల్లేశం, ఆలయ కమిటీ ప్రతినిధులు కొండాల్ రావు, న్యాలమడుగు శంకరయ్య, దొనకొండ ప్రభాకర్ రెడ్డి, గుజ్జుల ప్రసాదరెడ్డి, బి.లక్ష్మారెడ్డి, కోట శ్రీనివాస్ రెడ్డి, ముప్పిడి మల్లారెడ్డి, కసిడి రాజశేఖర్ రెడ్డి భక్తులు పాల్గొన్నారు.
రాజన్న సేవలో కరీంనగర్ డీఈవో జనార్దన్‌రావు
వేములవాడ: జిల్లా విద్యాధికారిగా బాధ్యతలు స్వీకరించిన జనార్దన్‌రావు గురువారం వేముల వాడ రాజన్నను దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ప్రత్యేక దర్శనం అవకాశం కల్పించారు. స్వామి వారి దర్శనానంతరం ఆశీర్వచన మండపంలో బ్రాహ్మణులు ఆశీర్వదించి రాజన్న ప్రసాదం అందజేశారు. డీఈవో వెంట మధు మహేశ్, మందిరం రఘు, పోగుల ధనుంజయ్ పాల్గొన్నారు.
పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన సీపీ
పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన సీపీ
Comments
Please login to add a commentAdd a comment