
ఫోల్డబుల్ టేబుల్
ఇల్లంతకుంట(మానకొండూర్): రోడ్డు పక్కన పండ్లు, కూరగాయలు అమ్మే చిరువ్యాపారులకు ఉపయోగపడేలా ఫోల్డబుల్ టేబుల్ తయారు చేసింది రాజన్న సిరిసిల్ల జిల్లాలోని గాలిపెళ్లి హైస్కూల్ చెందిన విద్యార్థి జి.అమిత. రోడ్డు పక్కన కూరగాయలు అమ్ముకునే చిరు వ్యాపారులు ఆకస్మికంగా వర్షం వచ్చినప్పుడు తడవకుండా తొందరగా వస్తువులు సర్దుకునేందుకు ఫోల్డబుల్ టేబుల్ ఎంతో ఉపయోగపడుతుంది. ఈ ప్రాజెక్టు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో నిర్వహించిన ఇన్‌స్పైర్ అవార్డ్స్ పోటీల్లో 68 ప్రాజెక్టులతో పోటీ పడి రాష్ట్రస్థాయికి ఎంపికై ందని గైడ్ టీచర్ యాద రవి, హెచ్‌ఎం పావని పేర్కొన్నారు. జనవరిలో జడ్చర్లలో జరిగిన పోటీల్లో ఫోల్డబుల్ టేబుల్ పనితీరును ప్రదర్శించారు. అమిత ప్రాజెక్టును పరిశీలించిన కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా, జిల్లా సైన్స్ అధికారి పాముల దేవయ్య అభినందించారు.
ఉమెన్ అయిట్ డివైజ్
బాలికలు, మహిళలపై అఘాయిత్యాలు పసిగట్టడానికి ఉపయోగపడే ఉమెన్ అయిట్ (ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్) పరికరాన్ని తయారు చేసి జిల్లా, రాష్ట్రస్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో పాల్గొంది రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట హైస్కూ ల్లో 9వ తరగతి చదువుతున్న వొడ్నాల రేష్మ. కెమెరాతో కూడిన ఈ పరికరం స్మార్ట్ వాచ్‌లో ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. ఈ పరికరం చిన్నపిల్లలు, పెద్దలు కూడా ఉపయోగించవచ్చు. వాచ్ యందు అమర్చిన కెమెరా నిందితుల ఫొటోలను మనం ముందే సేవ్ చేసుకున్న ఫోన్‌నంబర్లకు చేరవేస్తుంది. ఈ పరికరం తీసిన ఫొటోలు ఎవరు డిలీట్ చేయడానికి వీలు లేకుండా క్లౌడ్ స్టోరేజ్ కూడా చేస్తుంది. వాచ్‌లో నిర్మితమై ఉన్న ఈ డివైస్ వాచ్ బటన్ ప్రెస్ చేయడం ద్వారా ఆపదలో ఉన్నాను రక్షించండి అని సౌండ్ మనం సేవ్ చేసిన నంబర్లకు వస్తుంది. జడ్చర్లలో జరిగిన పోటీల్లో ఈ పరికరాన్ని ప్రదర్శించారు. రేష్మకు గైడ్ టీచర్‌గా మహేశ్‌చంద్ర ఉన్నారు.

ఫోల్డబుల్ టేబుల్
Comments
Please login to add a commentAdd a comment