ఓదెల(పెద్దపల్లి): ఓదెల మండలం గుంపుల గ్రామంలో అనుమతి లేకుండా మానేరు ఇసుకను హైదరాబాద్‌కు తరలిస్తున్న పెద్దిరెడ్డి జనార్దన్‌రెడ్డి, మణిదీప్, పొన్నగంటి సురేశ్, కోరి భాస్కర్, రాజన్‌కుమార్‌పై కేసు నమోదు చేసినట్లు పొత్కపల్లి ఎస్సై రమేశ్ పేర్కొన్నారు. లారీని సీజ్‌చేసినట్లు తెలిపారు. అక్రమంగా నిల్వచేసిన 20ట్రాక్టర్ల ఇసుకపై తహసీల్దార్‌కు సమాచారం ఇచ్చినట్లు వివరించారు.
హత్యపై విచారణ వేగవంతం
సిరిసిల్లక్రైం: సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని ఇండస్ట్రియల్ జోన్ స్థలంలో బుధవారం గుర్తుతెలియని మృతదేహం(38) లభించిన విషయం తెలిసిందే. హత్యకేసు నమోదు చేసిన పోలీసులు విచారణ వేగవంతం చేశారు. సంఘటన స్థలంలో మద్యం బాటిళ్లు, పక్కనే బండరాయి పడి ఉండడాన్ని బట్టి హత్యగా భావిస్తూ దర్యాప్తు చేస్తున్నట్లు సిరిసిల్ల టౌన్ సీఐ కృష్ణ తెలిపారు. మహాశివరాత్రి సందర్భంగా వైన్‌షాపులు మూసి ఉండగా సంఘటన స్థలంలో మద్యం బాటిళ్లు ఉండడంతో కొందరు బెల్ట్‌షాప్ నిర్వాహకులను విచారించినట్లు తెలిసింది.
చికిత్సపొందుతూ యువకుడి మృతి
సుల్తానాబాద్‌రూరల్(పెద్దపల్లి): సుల్తానాబాద్ మండలం దుబ్బపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో పెద్దపల్లి పట్టణం క్రిస్టియన్ కాలనీకి చెందిన వల్లెపు జానుప్రకాశ్(22) చికిత్సపొందుతూ మృతిచెందాడు. ఎస్సై శ్రావణ్‌కుమార్ తెలిపిన వివరాలు.. జానుప్రకాశ్ గత డిసెంబర్ 18న డిగ్రీ పరీక్ష రాసేందుకు తన ఇద్దరు స్నేహితులతో కలిసి ద్విచక్ర వాహనంపై వెళ్తున్న క్రమంలో లారీని ఢీకొనగా తీవ్రగాయాలయ్యాయి. హైదారాబాద్ నిమ్స్‌లో చేర్పించగా చికిత్స పొందుతూ గురువారం మృతిచెందాడు. మృతుడి తల్లి జ్యోతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment