8న జాతీయ లోక్ అదాలత్
కరీంనగర్‌క్రైం: జాతీయ, రాష్ట్రన్యాయ సేవాధికార సంస్థల ఆదేశాలతో జిల్లావ్యాప్తంగా అన్ని కోర్టుల్లో ఈ నెల 8న జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, న్యాయమూర్తి వెంకటేశ్ తెలిపారు. శుక్రవారం ఆ యన మాట్లాడుతూ.. లోక్ అదాలత్‌లో రాజీ చేయదగిన 3,120 కేసులు గుర్తించామని, 1,080 కేసుల్లో కక్షిదారులకు నోటీసులు పంపించడం జరిగిందన్నా రు. సివిల్ కేసులు 489 గుర్తించి నోటీసులు పంపినట్లు పేర్కొన్నారు. నోటీసులు అందుకున్న వారు లోక్ అదాలత్‌కు హాజరై కేసులు పరిష్కరించుకో వాలని సూచించారు. లోక్ అదాలత్ తీర్పులకు ఆప్పిల్ ఉండదని, రాజీ చేదగిన క్రిమినల్, సివిల్, ఫ్యామిలీ, బ్యాంక్, మోటార్ ప్రమాద కేసులతో పాటు, చెక్‌బౌన్స్, డ్రంక్ అండ్ డ్రైవ్, కోర్టుకు రాని కేసులను పరిష్కరించనున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment